ETV Bharat / bharat

Jabalpur collector: ఆ కారణంతో.. జీతం వద్దన్న కలెక్టర్​!

Jabalpur collector: ప్రజా ఫిర్యాదులను పరిష్కరించలేకపోయినందుకు ఈ నెల అందాల్సిన తన జీతాన్ని నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు ఓ జిల్లా కలెక్టర్​. 100 రోజులైనా సమస్యలు తీర్చలేకపోయినందుకు ఇతర అధికారుల వేతనాన్ని కూడా ఆపాలని సూచించారు. ఇంతకీ ఆయన ఎవరంటే..

Jabalpur collector, జబల్​పుర్ కలెక్టర్​
కలెక్టర్​ సార్​.. మీరు సూపర్
author img

By

Published : Dec 28, 2021, 5:15 PM IST

Jabalpur collector: నెలలు గడిచినా ప్రజా ఫిర్యాదులను పరిష్కరించలేకపోయినందుకు తనకు డిసెంబర్​ నెలకు వచ్చే జీతాన్ని నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు మధ్యప్రదేశ్ జబల్​పుర్ జిల్లా కలెక్టర్​ కరంవీర్​ శర్మ. 100 రోజులు దాటినా సీఎం హెల్ప్​లైన్​కు అందిన ఫిర్యాదులు ఇంకా అలానే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు ఇతర అధికారుల వేతనాలను కూడా ఆపాలని జిల్లా కోశాధికారికి సూచించారు.

Jabalpur collector, జబల్​పుర్ కలెక్టర్​
Jabalpur collector: కలెక్టర్​ సార్​.. మీరు సూపర్

కలెక్టర్ కరంవీర్ శర్మ సోమవారం.. శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో సీఎం హెల్ప్​లైన్​కు వచ్చిన ఫిర్యాదులు 100 రోజులు దాటినా పెండింగ్​లోనే ఉన్నాయని ఆయన దృష్టికి వచ్చింది. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సున్నితంగా వ్యవహరించాలని, ఫిర్యాదు అందగానే నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని తేల్చి చెప్పారు. ఒక్క ఫిర్యాదును కూడా వదిలివేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించనందుకు ఇతర అధికారులతో పాటు స్వచ్ఛత, హెల్ప్​లైన్​ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిప్యూటీ మున్సిపల్​ కమిషనర్ల జీతాలను కూడా నిలిపివేయాలని జిల్లా కోశాధికారిని కలెక్టర్​ ఆదేశించారు.

Collector salary pending

అంతేగాక రెవెన్యూ కేసుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నందుకు తహశీల్దార్ల ఇంక్రిమెంట్​లను కూడా ఆపాలని కలెక్టర్​.. అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశానికి హాజరుకానందుకు జిల్లా మార్కెటింగ్​ అధికారికి షోకాజ్​ నోటీసులు పంపించారు.

సీఎం హెల్ప్​ లైన్​, సమాధాన్​కు వచ్చిన ఫిర్యాదులను పరిమిత కాలంలో, 100 రోజులకుపైగా పెండింగ్​లో ఉన్న సమస్యలను డిసెంబర్​ 31లోగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్​ శర్మ హుకుం జారీ చేశారు.

ఇదీ చదవండి: ఒమిక్రాన్​ కట్టడికి మరిన్ని ఆంక్షలు.. పాఠశాలలు, థియేటర్లు బంద్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.