జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలోని ఘాట్ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాన్ని కనుగొన్నారు పోలీసులు, సైన్యం. చక్రంతి గ్రామ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నట్లు సమాచారం అందగా.. పోలీసులు-సైన్యం సంయుక్తంగా దాడి చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఈ క్రమంలో ఉగ్రస్థావరాన్ని ధ్వంసం చేసి.. భారీగా పేలుడు పదార్థాలను కనుగొన్నారు. ప్లాస్టిక్ సంచిలో ఉంచిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉగ్రవాదులే అవి అక్కడ ఉంచినట్లు అనుమానిస్తున్నారు. అయితే దోడాలో ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాలు చురుకుగా లేవని.. ఒక్క ఉగ్రవాది కూడా యాక్టివ్గా సీనియర్ అధికారి చెప్పారు.
గతంలో ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు తమ కార్యకలాపాల కోసం ఉపయోగించినట్లు అనుమానిస్తున్న సొరంగాన్ని పోలీసులు కనుగొన్నారు.
ఈ దాడిలో పోలీసులు 4 డిటోనేటర్లు, ఒక బ్యాటరీ(12వోల్టు), 50 మీటర్ల ఎలక్ట్రిక్ వైర్, రెండు ప్రెజర్ కుక్కర్లలో నింపిన ఐఈడీ, ఆర్డీఎక్స్ నింపిన రెండు పైపు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు ఉగ్రవాదులు హతం