HCL Recruitment 2023 : ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని నిరంతరం శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ 184 ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
ITI jobs trade apprentice 2023 : మేట్, బ్లాస్టర్, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, సర్వేయర్, మాసన్, హార్టికల్చర్ అసిస్టెంట్
ట్రేడ్ విభాగాలు
ITI trade list : ఈ నోటిఫికేషన్ ద్వారా హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్లో.. మైన్స్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్, సివిల్, మెకానికల్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు ఏమిటి?
ITI trade apprentice eligibility : అభ్యర్థులు ట్రేడ్ మేట్ (మైన్స్), బ్లాస్టర్ (మైన్స్) పోస్టులకు 10తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే చాలు.
మిగతా ట్రేడ్ విభాగాలకు చెందిన అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విద్యా సంస్థ నుంచి 10+2 తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సంబంధిత ఐటీఐ విభాగంలోనూ క్వాలిఫై అయ్యుండాలి.
వయోపరిమితి ఎంత?
ITI trade apprentice age limit : 2023 ఆగస్టు 05 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్లు మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
ITI trade apprentice selection process : 10వ తరగతి/ 10+2 తరగతి ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ ఉన్న అభ్యర్థులను వడపోస్తారు. ముఖ్యంగా 10వ తరగతి లేదా 10+2 తరగతిలో వచ్చిన మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఐటీఐలో వచ్చిన మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇస్తారు.
ట్రేడ్ మేట్ (మైన్స్), బ్లాస్టర్ (మైన్స్) పోస్టుల విషయంలో 10తరగతి మార్కులకే 100 శాతం వెయిటేజీ ఇవ్వడం జరుగుతుంది. ఒక వేళ అభ్యర్థుల మార్కులు సమానంగా ఉండే, వయస్సు ఎక్కువ ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత కల్పిస్తారు. తరువాత వారికి శారీరక దృఢత్వ పరీక్షలు (ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్) నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం ఏమిటి?
ITI trade apprentice application process : అభ్యర్థులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ https://www.apprenticeship.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ట్రైనింగ్ - జీతభత్యాలు
ITI trade apprentice salary : ఎంపికైన అభ్యర్థులకు ఆయా ట్రేడ్లకు అనుగుణంగా ట్రైనింగ్ ఇస్తారు. ఇదే సమయంలో నిబంధనలకు అనుగుణంగా వారికి స్టైపెండ్ కూడా అందిస్తారు.
ముఖ్యమైన తేదీలు
HCL Recruitment 2023 important dates :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2023 జులై 6
- దరఖాస్తులకు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 5
- ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన తేదీ : 2023 ఆగస్టు 19