IT Raids In Odisha : ఒడిశాలో ఆదాయపు పన్ను శాఖ జరుపుతున్న దాడుల్లో భారీగా డబ్బు బయటపడుతోంది. బోలంగీర్ జిల్లాలోని సుదాపరా ప్రాంతంలోని దేశీయ మద్యం తయారీదారుడి ఇంటిలో మరో 20 బ్యాగుల నగదును ఐటీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. మద్యం తయారుదారుడి నుంచి రికవరీ చేసుకున్న సొమ్మును లెక్కిస్తున్నామని, అది రూ.50 కోట్ల వరకు ఉంటుందని ఓ ఐటీ అధికారి అంచనా వేశారు.
"లిక్కర్ డిస్టిలరీ గ్రూప్‌పై 150 మంది అధికారులు దాడులు జరిపారు. దాడుల సమయంలో వివిధ ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పత్రాల పరిశీలన కోసం హైదరాబాద్‌కు చెందిన మరో 20 మంది ఐటీ అధికారులను రప్పించాం. స్వాధీనం చేసుకున్న డబ్బు సంబల్‌పుర్, బోలంగీర్‌లోని రెండు ఎస్బీఐ బ్రాంచ్‌లలో లెక్కిస్తున్నారు. ఎక్కువగా రూ.500 నోట్లు ఉన్నాయి. అందుకే లెక్కించడం కష్టంగా మారింది. ఎక్కువ మొత్తంలో డబ్బులు లెక్కించడం వల్ల క్యాష్ కౌంటింగ్ మెషిన్లు మొరాయించాయి. అందుకే పలు బ్యాంకుల చెందిన క్యాష్ కౌంటింగ్ మెషిన్లను తెప్పించాం" అని ఐటీ అధికారి ఒకరు తెలిపారు.
ఒడిశాలోని భువనేశ్వర్, బోలంగీర్, సంబల్‌పుర్‌తోపాటు ఝార్ఖండ్‌లోని రాంచీ, బంగాల్ రాజధాని కోల్‌కతాలోనూ ఇప్పటివరకు సోదాలు జరిగాయి. ఇప్పటివరకు 290 కోట్ల రూపాయల అక్రమ డబ్బును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోగా ఇంటెలిజెన్స్ సమాచారంతో మళ్లీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఝార్ఖండ్‌లో ఓ కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన కార్యాలయాల్లో భారీగా అక్రమ డబ్బు చిక్కింది. ఐటీ సోదాల్లో లభ్యమైన డబ్బుపై ఇప్పటికే స్పందించిన ప్రధాని మోదీ ఎవరైతే ప్రజాధనాన్ని దోచుకున్నారో వారి నుంచి సొమ్మును తిరిగి ప్రజలకు ఇస్తామని హామీ ఇచ్చారు.
'అదంతా బినామీ సంపదే'
ఒడిశాలోని డిస్టిలరీలపై ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడడంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. మద్యం వ్యాపారుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదును 'బినామీ సంపద'గా అభివర్ణించారు. ఇంత పెద్ద మొత్తంలో బినామీ సొమ్ము రికవరీ కావడం ఆందోళన కలిగించే విషయమని ప్రధాన్ అన్నారు. 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దోచుకున్న డబ్బును రికవరీ చేస్తారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఇదీ మోదీ హామీ' అని ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ వేదికగా తెలిపారు.
-
ଓଡ଼ିଶାରେ କିଛି ଦିନ ହେବ ଗଣମାଧ୍ୟମରେ ଶହ ଶହ କୋଟି ଟଙ୍କା ଜବତ ହେବା ଖବର ମୋତେ ବିସ୍ମିତ କରିଛି । କେନ୍ଦ୍ରୀୟ ସଂସ୍ଥାର ଚଢାଉ ଦ୍ୱାରା ଓଡ଼ିଶା ଭଳି ରାଜ୍ୟରୁ ଏକାସାଙ୍ଗରେ ଏତେ ପରିମାଣରେ ବେନାମୀ ଅର୍ଥ ଜବତ ହେବା ଚିନ୍ତାର ବିଷୟ । ଓଡ଼ିଶା, ପଶ୍ଚିମବଙ୍ଗ ଓ ଝାଡଖଣ୍ଡ ଭଳି ରାଜ୍ୟର କିଛି ବ୍ୟକ୍ତିଙ୍କ ଏହି ଟଙ୍କା ସହ ସମ୍ପର୍କ ଥିବା…
— Dharmendra Pradhan (@dpradhanbjp) December 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ଓଡ଼ିଶାରେ କିଛି ଦିନ ହେବ ଗଣମାଧ୍ୟମରେ ଶହ ଶହ କୋଟି ଟଙ୍କା ଜବତ ହେବା ଖବର ମୋତେ ବିସ୍ମିତ କରିଛି । କେନ୍ଦ୍ରୀୟ ସଂସ୍ଥାର ଚଢାଉ ଦ୍ୱାରା ଓଡ଼ିଶା ଭଳି ରାଜ୍ୟରୁ ଏକାସାଙ୍ଗରେ ଏତେ ପରିମାଣରେ ବେନାମୀ ଅର୍ଥ ଜବତ ହେବା ଚିନ୍ତାର ବିଷୟ । ଓଡ଼ିଶା, ପଶ୍ଚିମବଙ୍ଗ ଓ ଝାଡଖଣ୍ଡ ଭଳି ରାଜ୍ୟର କିଛି ବ୍ୟକ୍ତିଙ୍କ ଏହି ଟଙ୍କା ସହ ସମ୍ପର୍କ ଥିବା…
— Dharmendra Pradhan (@dpradhanbjp) December 9, 2023ଓଡ଼ିଶାରେ କିଛି ଦିନ ହେବ ଗଣମାଧ୍ୟମରେ ଶହ ଶହ କୋଟି ଟଙ୍କା ଜବତ ହେବା ଖବର ମୋତେ ବିସ୍ମିତ କରିଛି । କେନ୍ଦ୍ରୀୟ ସଂସ୍ଥାର ଚଢାଉ ଦ୍ୱାରା ଓଡ଼ିଶା ଭଳି ରାଜ୍ୟରୁ ଏକାସାଙ୍ଗରେ ଏତେ ପରିମାଣରେ ବେନାମୀ ଅର୍ଥ ଜବତ ହେବା ଚିନ୍ତାର ବିଷୟ । ଓଡ଼ିଶା, ପଶ୍ଚିମବଙ୍ଗ ଓ ଝାଡଖଣ୍ଡ ଭଳି ରାଜ୍ୟର କିଛି ବ୍ୟକ୍ତିଙ୍କ ଏହି ଟଙ୍କା ସହ ସମ୍ପର୍କ ଥିବା…
— Dharmendra Pradhan (@dpradhanbjp) December 9, 2023
'కాంగ్రెస్ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతిస్తోంది'
మరోవైపు, ఝార్ఖండ్‌లో ఓ కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో గత మూడు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. ' శనివారం ఉదయం వరకు నాకు అందిన సమాచారం ప్రకారం రూ.290 కోట్ల నగదును ఆటీ అధికారులు సీజ్ చేశారు. మరో 10 లాకర్లలో ఉన్న నగదును లెక్కించాల్సి ఉంది. కాంగ్రెస్ ఎంపీ ఉంట్లో నగదు రూ.500 కోట్లు పట్టుబడినా ఆశ్చర్యపోవనవరసం లేదు. కాంగ్రెస్ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని దెబ్బతిస్తోంది' అని విమర్శించారు.
-
#WATCH | Deoghar, Jharkhand: BJP MP Nishikant Dubey says, "The raid has been going on for the last three days, he is a senior Congress MP only. As per the information I had till morning, Rs 290 crore cash has been counted, 8 lockers are yet to open, and 10 rooms are yet to open.… pic.twitter.com/K3JKdiFYhu
— ANI (@ANI) December 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Deoghar, Jharkhand: BJP MP Nishikant Dubey says, "The raid has been going on for the last three days, he is a senior Congress MP only. As per the information I had till morning, Rs 290 crore cash has been counted, 8 lockers are yet to open, and 10 rooms are yet to open.… pic.twitter.com/K3JKdiFYhu
— ANI (@ANI) December 9, 2023#WATCH | Deoghar, Jharkhand: BJP MP Nishikant Dubey says, "The raid has been going on for the last three days, he is a senior Congress MP only. As per the information I had till morning, Rs 290 crore cash has been counted, 8 lockers are yet to open, and 10 rooms are yet to open.… pic.twitter.com/K3JKdiFYhu
— ANI (@ANI) December 9, 2023
-
#WATCH | BJP workers stage protest against Congress MP Dhiraj Prasad Sahu over the recovery of unaccounted money worth Rs 200 crore from him during the Income Tax raids. pic.twitter.com/6ZZLwcqEGk
— ANI (@ANI) December 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | BJP workers stage protest against Congress MP Dhiraj Prasad Sahu over the recovery of unaccounted money worth Rs 200 crore from him during the Income Tax raids. pic.twitter.com/6ZZLwcqEGk
— ANI (@ANI) December 9, 2023#WATCH | BJP workers stage protest against Congress MP Dhiraj Prasad Sahu over the recovery of unaccounted money worth Rs 200 crore from him during the Income Tax raids. pic.twitter.com/6ZZLwcqEGk
— ANI (@ANI) December 9, 2023
'మెమొరీ' మ్యాన్ అభయ్- 3 గిన్నిస్ రికార్డులు కైవసం- ఒక్క నిమిషంలోనే!
మళ్లీ మోదీనే నెంబర్ వన్- 76 శాతం ప్రజామోదం- ఎవరికీ అందనంత ఎత్తులో!