Actor Vijay IT Raids: పన్ను ఎగవేత ఆరోపణలతో తమిళ స్టార్ హీరో విజయ్ దగ్గరి బంధువు జేవియర్ బ్రిటో నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. చెన్నై అడయార్‌లోని ఆయన నివాసంతో పాటు కార్యాలయంలో సోదాలు చేశారు. రెండు రోజులుగా ఈ దాడులు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
చైనాకు చెందిన షియోమీ కంపెనీ విడిభాగాల ఎగుమతులు, దిగుమతులను బ్రిటో కంపెనీ నిర్వహిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ఆధారంగా చేసుకుని కంపెనీకి చెందిన 25 కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బ్రిటో నివాసంలోనూ సోదాలు జరిపినట్లు వివరించారు.
ఇదీ చూడండి: 'ఫొటోలతో బ్లాక్మెయిల్'.. యువకుడిని హత్య చేయించిన పదో తరగతి బాలికలు