ETV Bharat / bharat

ఇస్రో గూఢచర్యం కేసు: పోలీసులపై సీబీఐ ఎఫ్​ఐఆర్​ - ఇస్రో కేసు

1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో కేరళ పోలీసులపై సీబీఐ ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది. ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణ్​ను ఈ కేసులో ఇరికించటానికి వారు కుట్ర పన్నారని స్పష్టం చేసింది.

cbi
ఇస్రో గూఢచౌర్యం కేసు
author img

By

Published : May 3, 2021, 8:03 PM IST

1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో కేరళ పోలీసులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం.. ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్​ను​ ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది.

నంబి నారాయణన్‌పై పోలీసులు కుట్ర పన్నారన్న అభియోగాలపై అత్యున్నత కమిటీ సమర్పించిన నివేదికను సీబీఐకి అప్పగించాలని ఏప్రిల్​ 15న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నివేదికలోని వివరాలను ప్రాథమిక దర్యాప్తు ఫలితాలుగా పరిగణించి.. వాటి ఆధారంగా చర్యలు తీసుకునే అధికారాన్ని సీబీఐకి అప్పగించింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈ కేసులో విచారణ జరిపిన సీబీఐ.. నంబి నారాయణ్​పై మోపిన ఆరోపణలు అవాస్తవాలేనని తాజాగా స్పష్టం చేసింది.

ఏంటీ కేసు?

ఇస్రోలో విశేష సేవలందించిన నంబి నారాయణన్..‌ 1994లో దేశద్రోహిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇస్రో మిషన్లకు సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను విదేశాలకు చేరవేశారన్న అభియోగాలు ఆయనపై వచ్చాయి.

ఇదీ చూడండి: కొవిడ్ నియంత్రణ మా పని కాదు: ఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.