గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రపంచ దేశాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలిపాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని కాంక్షించింది అమెరికా.
భారత రాజ్యాంగం ఉన్నతమైనదని అమెరికా కీర్తించింది. దాని వల్లనే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పేరుగడించిందని ప్రశంసించింది.
"భారత్‌కు 72 వ గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు. ఇరు దేశాల్లోని ప్రజాస్వామ్య సూత్రాల్ని పంచుకోవడం ద్వారా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయి."
- దక్షిమ మధ్య ఆసియా విభాగం, అమెరికా
ఆస్ట్రేలియా, భారత్ ఒకే దృక్పథం కలిగిన దేశాలు అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ అన్నారు. రెండూ ప్రజాస్వామ్యం కోసం స్వేచ్ఛకోసం పాటుపడతాయని అన్నారు. అలాంటి భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
"ఎంత యాదృచ్ఛికమూ ఆస్ట్రేలియా దినోత్సవం కూడా ఈ రోజే. ఇండియా గణతంత్ర దినోత్సవం-ఆస్ట్రేలియా డే ఓకే రోజు రావడం చాలా సంతోషంగా ఉంది."
-స్కాట్ మోరిసన్, ఆస్ట్రేలియా ప్రధాని
"భారత ప్రధాని నరేంద్ర మోదీకి 72వ గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు. ఇండియా ప్రతి అడ్డంకిని అధిగమించి మరింత శక్తివంతమైన దేశంగా ఎదగాలి."
-మహింద రాజపక్స, శ్రీలంక ప్రధాని
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
"భారత రాజ్యంగం చాలా గొప్పది. అదే ప్రపంచంలో భారత్‌ను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చేసింది."
-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని
ఏటేటా ఇరు దేశాల స్నేహం ఇలానే వర్ధిల్లాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహూ ఆకాంక్షించారు. భారత ప్రధాని మోదీకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మోదీతో ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇదీ చూడండి: ప్రదర్శనకు.. రాజ్యాంగ అసలు ప్రతి