గణతంత్ర దినోత్సవానికి ముందు కర్ణాటక బెంగళూరులో ఓ ఉగ్రకుట్ర బయటపడింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) సంస్థతో సంబంధాలు ఉన్న ఓ ముష్కరుడిని అంతర్గత భద్రతా బలగాలు గుర్తించాయి.
అలా బయటపడ్డాడు..
ఆన్లైన్లో విదేశాల నుంచి తుపాకులను ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే.. దాన్ని తీసుకునేందుకు కస్టమ్స్ అధికారులకు అనుమతి పత్రం చూపించాల్సి ఉంటుంది. కానీ, వారికి సదరు వ్యక్తి ఆ లైసెన్స్ చూపించలేదు. దీంతో.. అంతర్గత భద్రతా బలగాలకు(ఐఎస్ఎఫ్) కస్టమ్స్ అధికారులు సమాచారమిచ్చారు. ఈ మేరకు అతడిపై ఐఎస్ఎఫ్ బృందం కేసు నమోదు చేసింది. నిందితుడిని ముజీజ్ బెయిగ్గా గుర్తించింది. అతడి పట్టుకునేందుకు గాలింపు చేపట్టింది.
ప్రాథమిక దర్యాప్తులో భాగంగా.. అతడి ఫేస్బుక్ ఖాతాలో 'సేవ్ సిరియా' అనే నినాదాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. చాలా రోజుల క్రితం ఇదే తరహాలో ఐసిస్‌తో సంబంధం ఉన్న డాక్టర్ అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ బ్రేవ్‌ను బెంగళూరులో అరెస్టు చేశారు.
ఇదీ చూడండి:హవాలా రాకెట్: ఈడీ కస్టడీకి ఇద్దరు చైనీయులు