ETV Bharat / bharat

'ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? ఆ చట్టం రద్దు చేయాల్సిందే!'

Irom Sharmila On AFSPA: ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు మణిపుర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల. ఈ చట్టం కారణంగా ఈశాన్య ప్రాంత ప్రజలు ఇంకా ఎన్నిరోజులు బాధలు పడాలని ప్రశ్నించారు.

Irom Sharmila
ఇరోమ్‌ షర్మిల
author img

By

Published : Dec 13, 2021, 6:48 PM IST

Irom Sharmila On AFSPA: కశ్మీర్‌తోపాటు ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలని ఉక్కు మహిళగా పేరు పొందిన ఇరోమ్‌ షర్మిల డిమాండ్ చేశారు. ఈ చట్టం కారణంగా ప్రజలు అణచివేతకు గురవుతున్నారని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నారు.

" ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని ఎందుకు రద్దు చేయాలో.. నాగాలాండ్​ ఘటనతో మరోసారి అర్థమైంది. ప్రజల ప్రాణాలు మరీ అంత విలువలేనివి కావు. ఈ చట్టం కారణంగా ఈశాన్య ప్రాంత ప్రజలు ఇంకా ఎన్నిరోజులు బాధలు పడాలి? తిరుగుబాటు నెపంతో మీరు ప్రజల కనీస హక్కులను హరించలేరు. తిరుగుబాటును అరికట్టడానికి వేరే విధానాలు ఉన్నాయి."

-- ఇరోమ్ షర్మిల, మణిపుర్ ఉక్కు మహిళ

ఈ చట్టంతో ఏమైనా సాధించిందా..?

'1958లో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పటి నుంచి కేంద్రం.. తాము అనుకున్నది ఏమైనా సాధించిందా? లేదంటే మరి ఈ చట్టం ఎందుకు?' అని షర్మిల ప్రశ్నించారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఈ చట్టం రద్దు చేయడంపై దృష్టి సారించాలన్నారు. తిరుగుబాటును అణచివేసేందుకు వేరే మార్గాలున్నాయని వ్యాఖ్యానించారు. ఛత్తీస్​గఢ్​లో ఏళ్ల నుంచి మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్నారని, మరి అక్కడ ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు షర్మిల.

నాగాలాండ్​లో డిసెంబరు 5న మిలిటెంట్లుగా భావించి పౌరులపై కాల్పులు జరిపాయి భద్రతా బలగాలు. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. మరో 11 మంది పౌరులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. నాగాలాండ్- మయన్మార్ సరిహద్దుల్లో మోన్ జిల్లాలో ఈ కాల్పులు జరిగాయి.

ఇదీ చూడండి:

Nagaland Under AFSPA: కాల్పుల మోతతో నాగాలు మళ్లీ దూరమవుతారా..?

నాగాలాండ్ ఘటనపై సైన్యం ప్రత్యేక దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.