IOCL Apprentice Jobs : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలు చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. చెన్నైలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 490 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు సదరన్ డివిజన్ పరిధిలోని ఆరు రీజియన్లలో పనిచేయాల్సి ఉంటుంది. ( IOCL Recruitment 2023 )
ఐవోసీఎల్ సదరన్ రీజియన్స్
IOCL Southern Region : తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఉద్యోగాల వివరాలు
IOCL Apprenticeship 2023 :
- ట్రేడ్ అప్రెంటీస్ : 150 పోస్టులు
- టెక్నీషియన్ అప్రెంటీస్ : 110 పోస్టులు
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ : 230 పోస్టులు
ఉద్యోగాలు - విభాగాలు
IOCL Trades : ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, సివిల్, ఎలక్ట్రానిక్స్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్
విద్యార్హతలు ఏమిటి?
IOCL Recruitment Qualification : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి ఐటీఐ, డిప్లొమా; బీబీఏ, బీఎ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి వివరాలు
IOCL Recruitment Age Limit :
- అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 31 నాటికి 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-నాన్ క్రిమీలేయర్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
IOCL Recruitment Selection Process : అభ్యర్థులకు ముందుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
ఆన్లైన్లో దరఖాస్తు చేయడం ఎలా?
IOCL Recruitment Online Apply : ఐవోసీఎల్ అప్రెంటీస్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా, తమ రాష్ట్రాలకు సంబంధించిన ట్రేడ్/ టెక్నీషియన్ అప్రెంటీస్ వెబ్‌సైట్‌ల్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
- ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు : http://apprenticeshipindia.org/candidate-registration ఈ వెబ్సైట్లో ఐటీఐ అభ్యర్థులు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
- టెక్నీషియన్ అప్రెంటీస్ : https://www.mhrdnats.gov.in/boat/commonRedirect/registermenunew!registermenunew.action ఈ వెబ్సైట్లో డిప్లొమా అభ్యర్థులు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
- అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్/ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు.. ఉద్యోగంలో చేరినప్పుడు నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ ఐడీని సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి దీని IOCL వెబ్సైట్లో జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీల వివరాలు
IOCL Recruitment Important Dates :
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2023 ఆగస్టు 25
- ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్ 10