ETV Bharat / bharat

ఐటీఐ, డిగ్రీ అర్హతతో IOCLలో 1,603 జాబ్స్​- అప్లై చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 1:46 PM IST

IOCL Apprentice Jobs 2023 : ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్​లో ఖాళీగా ఉన్న 1603 అప్రెంటిస్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. మరి దీనికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన విద్యార్హతలు, అప్లికేషన్​ లాస్ట్​డేట్​, వయోపరిమితి తదితర వివరాలు మీ కోసం.

IOCL Apprentice 2023 Recruitment
IOCL Apprentice Jobs 2023

IOCL Apprentice Jobs 2023 : ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించింది భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్​). టెక్నికల్​, నాన్​-టెక్నికల్​ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1603 అప్రెంటిస్​ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్​ను​ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ట్రేడుల్లో పోస్టులు(IOCL Apprentice Job Vacancy Trades)!

  • టెక్నీషియన్​ అప్రెంటిస్- మెకానికల్​, ఎలక్ట్రికల్​, ఇన్​స్ట్రుమెంటేషన్​, సివిల్​, ఎలక్ట్రికల్​ అండ్​ ఎలక్ట్రానిక్స్​, ఎలక్ట్రానిక్స్​
  • ట్రేడ్​ అప్రెంటిస్(టెక్నికల్​ అండ్​ నాన్​-టెక్నికల్​)- ఫిట్టర్​, ఎలక్ట్రీషియన్​, ఎలక్ట్రానిక్స్ మెకానిక్​, ఇన్​స్ట్రుమెంట్​ మెకానిక్​, మెషినిస్ట్​

వయోపరిమితి(IOCL Apprentice Jobs Age Limit)!

  • 2023 నవంబర్​​ 30 నాటికి అభ్యర్థులు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీ అభ్యర్థులతో పాటు దివ్యాంగులకు కొన్ని వయోపరిమితి సడలింపులను కల్పించారు.

కావాల్సిన అర్హతలు(IOCL Apprentice Jobs Eligibility)!

  • బీఏ, బీకామ్​, బీఎస్​సీ, బీబీఏ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
  • సంబంధిత విభాగంలో సాంకేతిక నైపుణ్యం
  • క్వాంటిటేటివ్​ యాప్టిట్యూడ్​, జనరల్​ యాప్టిట్యూడ్​ సహా రీజనింగ్​ ప్రశ్నలు పరిష్కరించే సామర్థ్యం
  • బేసిక్​ ఇంగ్లిష్​ తెలిసి ఉండాలి
  • ఆన్​లైన్​ టెస్టులో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి
  • ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగులు 35 శాతం మార్కులు స్కోర్​ చేస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ(IOCL Apprentice Jobs Selection Process)!

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్​ ఫిట్‌నెస్​ సర్టిఫికెట్​
  • ఆన్​లైన్​ టెస్టులో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • మల్టిపుల్​ ఛాయిస్​ క్వశ్చన్స్​ పద్ధతిలో పరీక్ష ఉంటుంది.

ట్రైనింగ్​ వ్యవధి(IOCL Apprenticeship Training Period)!

  • రిటైల్​ సేల్స్​ అసోసియేట్​- 6 నెలలు
  • మిగతా అన్ని ట్రేడ్​​ అప్రెంటిస్​ పోస్టులకు 12 నెలల శిక్షణ

ముఖ్యమైన తేదీలు(IOCL Apprentice Jobs Important Dates)!

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 డిసెంబర్​ 16
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జనవరి 5

అధికారిక వెబ్​సైట్​!
IOCL Official Website : వయోపరిమితి సడలింపులు సహా నోటిఫికేషన్​కు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఐఓసీఎల్​ అధికారిక వెబ్​సైట్​ iocl.com ను చూడవచ్చు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన వివరాలను మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నంబర్​ లేదా ఈ-మెయిల్​ ఐడీకి పంపుతారు.

జాబ్​ లొకేషన్​!
IOCL Apprentice Job Location : దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఐఓసీఎల్​ రిఫైనరీలు, కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది.

ఇండియన్ నేవీలో 910 పోస్టులు - అప్లై చేసుకోండిలా!

డిప్లొమా అర్హతతో NTPCలో 114 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

డిగ్రీ అర్హతతో CSIRలో 444 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.