ETV Bharat / bharat

మహిళా రైతుల ఆందోళనతో దద్దరిల్లనున్న దిల్లీ - దిల్లీ ఉద్యమంలో మహిళా రైతులే కీలకం

మహిళా దినోత్సవం సందర్భంగా దిల్లీ నిరసనల్లో సోమవారం పెద్ద ఎత్తున మహిళా రైతులు పాల్గొననున్నారు. ఈ మేరకు పంజాబ్​, హరియాణా నుంచి భారీ సంఖ్యలో మహిళా రైతులు తరలివస్తున్నట్టు రైతు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ రోజును మహిళలకు అంకితం ఇస్తున్నట్టు వారు చెప్పారు.

Women to take centre stage at farmers' protest sites at Delhi's borders
మహిళా రైతు ఆందోళనలతో దద్దరిల్లనున్న దిల్లీ
author img

By

Published : Mar 7, 2021, 7:53 PM IST

Updated : Mar 7, 2021, 8:37 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సోమవారం దిల్లీ ఆందోళనల్లో మహిళా రైతులు కీలక పాత్ర పోషించనున్నారు. రైతులు, విద్యార్థినులు, కార్యకర్తలు.. ఇలా వేలాది మంది మహిళలు సింఘు, టిక్రీ, గాజీపూర్​ నిరసనల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం.. పంజాబ్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్(పశ్చిమ)​ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున మహిళా కర్షకులు తరలివస్తున్నట్టు రైతు సంఘం నాయకులు తెలిపారు. మహిళలే అన్నీ తామై ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని.. ఆ రోజును వారికే అంకితమిస్తున్నట్టు స్పష్టం చేశారు.

దేశీయ వ్యవసాయ రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు రైతు ఉద్యమంలో మహిళా దినోత్సవం రోజు వారికి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో మహిళల ప్రసంగం అనంతరం.. సింఘు సరిహద్దులో చిన్న తరహా కవాతు నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే.. వీటిపై ఇంకా స్పష్టత రాలేదు.

మహిళలు తాము సాధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలకు ప్రతీకగా.. ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఇదీ చూడండి: ట్రాక్​పై పల్టీలు కొట్టి.. రేసులో దూసుకెళ్లిన కారు

Last Updated : Mar 7, 2021, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.