ETV Bharat / bharat

TS secretariat construction: ఆత్మగౌరవ పతాక, ఆధునికతకు ప్రతీకగా సెక్రటేరియెట్‌ నిర్మాణం

Telangana New Secretariat: చరిత్రలో నిలిచిపోయే కట్టడం. యావద్దేశం అబ్బురపడే సౌధం. కేంద్రీకృత పరిపాలన వ్యవస్థకు దిక్సూచిగా నిలిచే ఈ మహాద్భుత కట్టడంలో ఎంతో మంది పాలుపంచుకున్నారు. భవిష్యత్‌ తరాలకు బలమైన పునాది కోసం ఎంతో ముందుచూపుతో నిరంతరం నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి నుంచి ఆఖరలో రంగులద్దే కూలీ వరకు వేలాది మంది శ్రామికులు రాత్రింవబవళ్ల చిందించిన స్వేదంతోనే ఈ పాలనాసౌధం రూపుదిద్దుకుంది. అనేక సవాళ్లను అధిగమించి దేశవిదేశాలు పర్యటించి రెండేళ్ల రికార్డు సమయంలో అత్యాధునిక హంగులతో అద్భుత కట్టడాన్ని నిలబెట్టిన ప్రతిఒక్కరికీ తెలంగాణ సమాజం సెల్యూట్‌ చేస్తోంది.

ts
ts
author img

By

Published : Apr 29, 2023, 10:57 PM IST

ఆత్మగౌరవ పతాక, ఆధునికతకు ప్రతీకగా సెక్రటేరియెట్‌ నిర్మాణం

Telangana New Secretariat: తెలంగాణ గౌరవాన్ని ప్రతిబింబించేలా నిర్మించతలపెట్టిన నూతన సచివాలయ నిర్మాణానికి 2019 జూన్‌ 27న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. భవన ఆకృతుల రూపకల్పనలో ఎంతో సమయాన్ని కేటాయించిన ఆయన ఆర్కిటెక్టులు, ఇంజినీర్లతో పలుదఫాలు చర్చించి తుదిరూపును అందజేశారు.

సీఎం కేసీఆర్‌ విజన్‌తో నిర్మితమైన పాలనాసౌధం..రూ. 610 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ సౌధం నిర్మాణ బాధ్యతలను స్వతహాగా ఇంజినీర్‌ అయిన రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన షాపూర్జీ పల్లోంజీకి నిర్మాణం చేపట్టగా ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రోజువారీ ప్రణాళికలు రచించుకుంటూ ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా ప్రశాంత్‌రెడ్డి శ్రద్ధ వహించారు.

28ఎకరాల్లో నిర్మాణాన్ని చేపట్టిన ప్రభుత్వం.. 2020 జులైలో పాత భవనాల కూల్చివేత మొదలుకాగా 2021 జనవరి 4న సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాగా పాత భవనాలను కూల్చటం నుంచి స్థలాన్ని ఒక రూపులోకి తెచ్చేందుకు అధికారులు పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. ఆ ప్రాంగణంలో కొన్ని చోట్ల వదులు నేల, మరికొన్ని చోట్ల బండరాళ్లు, మరికొన్ని చోట్ల భూమి బొగ్గు డంపు మాదిరిగా ఉండటంతో వాటిని చక్కదిద్దుకుంటూ బలమైన పునాదులు వేయటానికి సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది.

లైవ్‌ వైర్‌ డిటెక్షన్‌ టెక్నాలజీ.. భూగర్భ విద్యుత్తు లైన్ల తొలగింపు సమయంలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా పనులు చేపట్టటం అతి పెద్ద సవాలుగా మారింది. వీటిని లైవ్‌ వైర్‌ డిటెక్షన్‌ విధానంలో సురక్షితంగా తొలగించగలిగారు. సచివాలయం నిర్మాణం కోసం దేశీయంగానే తయారైన అత్యున్నత నాణ్యమైన సామగ్రి ఉపయోగించారు. అలాగే ముఖ్యమంత్రి సూచన మేరకు నిర్మాణ సామగ్రంతా ముందుగానే సమకూర్చుకోవటం పనుల వేగవంతానికి సులభతరమైంది.

సచివాలయ అవసరాలకు రోజుకు 125 కిలో లీటర్ల నీటి వినియోగం.. ఈ కట్టడంలో 7వేల టన్నుల ఉక్కును ఉపయోగించారు. 35వేల టన్నుల ఇసుక, 60వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌, 11లక్షల ఇటుకలతో నిర్మాణం చేపట్టారు. అలాగే 3లక్షల చదరపు అడుగుల గ్రానైట్, లక్ష చదరపు అడుగుల మార్బుల్తో పాటు నిర్మాణానికి వన్నె తెచ్చేందుకు రాజస్థాన్‌లోని ధోల్పూర్‌ రాతిని 3వేల 500 ఘనపు మీటర్ల ఉపయోగించి, అద్భుతంగా తీర్చిదిద్దారు. నిర్మాణంలో మహాద్వారాలు, ఇతర సౌకర్యాల కోసం 7వేల 500 ఘనపుటడుగుల కలపను వినియోగించారు. 12వేల మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో శ్రమించి సువిశాల 28 ఎకరాల్లో 10లక్షల 52 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల్లో ఈ అద్భుత కట్టడాన్ని నిలబెట్టారు.

ఎల్లప్పుడు నిర్మాణ కంపెనీ, ప్రభుత్వ అధికారుల సమన్వయం.. ఇండో-పర్షియన్‌-అరేబియన్‌ నిర్మాణాల మిశ్రమ శైలిలో కనిపించే ఈ సౌధం.. పూర్తికావాలంటే నాలుగేళ్లకు పైగా సమయం పడుతుందని నిపుణుల అంచనా వేశారు. ప్రతి అంతస్తులో జరిగే పనుల బాధ్యతలను ఎక్కడికక్కడ బృందాలకు అప్పగించి సీఎం కేసీఆర్‌, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ వచ్చారు. షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేశారు.

తక్కువ సమయంలో నిర్మాణం.. కరోనా వేళ ఆర్నెళ్ల పాటు పనులు నెమ్మదించగా.. ఈ సమయాన్ని మినహాయిస్తే రెండేళ్ల కాలంలో ఇంతటి అద్భుత కట్టడం పూర్తి చేయటం రికార్డుగా పేర్కొంటున్నారు. ఓ వైపు పార్లమెంటు నిర్మాణం జరుగుతున్న కాలంలోనే ఇటు సచివాలయం నిర్మాణమవుతుండటంతో దేశంలో ఒకే సమయంలో రెండు చారిత్రక నిర్మించినట్లయింది.

150 ఏళ్ల పాటు సేవలందించేలా చేపట్టిన ఈ నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకు అనుగుణంగా లోతైన పునాదులు నిర్మించగా... తవ్వకం సమయంలో కొన్ని చోట్ల పెద్ద పెద్ద రాళ్లు రావడంతో వాటిని కత్తిరించడం కొన్ని సమయాల్లో సవాలుగా మారింది. పెద్ద విస్తీర్ణంలో ఉన్న నిర్మాణం అయినందున పెద్ద స్పాన్ స్ట్రక్చరల్ లోడ్‌లను వినియోగించారు. నిర్మాణ వ్యవస్థల కోసం పోస్ట్ టెన్షన్ టెక్నాలజీని ఉపయోగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.