అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. మే 17న అతి తీవ్ర తుపాను వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. అనంతరం ఒకరోజు తర్వాత ఇది గుజరాత్ తీరం దాటుతుందని తెలిపింది.
ఈ అల్పపీడనం కారణంగా ఏర్పడిన 'తౌక్టే ' తుపాను.. శనివారం ఉదయం నాటికి తీవ్ర రూపు దాలుస్తుందని ఐఎండీ తెలిపింది. మే 16- 19 మధ్య ఈ తుపాను వల్ల గంటకు 175 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
తుపాను ముప్పుతో తీర ప్రాంత రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు అప్రమత్తమయ్యాయి. సముద్ర తీరం సహా.. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక మందిని పునరావాస శిబిరాలకు తరలించే చర్యలు చేపట్టాయి.
ఇదీ చూడండి: కేరళకు 'తౌక్టే' ముప్పు- రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్