SC On Overseas Mediclaim: దరఖాస్తుదారు ఆరోగ్య పరిస్థితిని ఒక్కసారి అంచనావేసి పాలసీని మంజూరు చేశాక.. మళ్లీ తాజా ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపి, దాన్ని తిరస్కరించే హక్కు బీమా సంస్థకు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
అమెరికాలో చేసిన వైద్యఖర్చులపై మన్మోహన్ నందా అనే వ్యక్తి క్లెయిమును బీమా సంస్థ తిరస్కరించింది. దీనిపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించగా నిరాశ ఎదురైంది. దీంతో ఆయన సుప్రీం తలుపు తట్టగా జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం ఆ పిటిషన్‌ను విచారించింది.
ఓవర్సీస్ మెడిక్లెయిమ్ బిజినెస్ అండ్ హాలిడే పాలసీ తీసుకున్న నందా అమెరికా వెళ్లినపుడు శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయానికి చేరగానే గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆంజియోప్లాస్టీ చేసిన వైద్యులు మూడు స్టెంట్లు వేశారు. ఈ బీమా క్లెయిము తిరస్కరణకు గురైంది. దరఖాస్తుదారు పాలసీ తీసుకొన్నపుడు తనకు 'హైపర్ లిపిడేమియా', చక్కెరవ్యాధి ఉన్నట్లు తెలియజేయలేదని బీమా సంస్థ తిరస్కరణకు కారణాలుగా చూపింది. దీనిపై సుప్రీం ఈ తీర్పు వెలువరించింది.
ఇదీ చూడండి: తల్లిపై అత్యాచారయత్నం.. మామను గొడ్డలితో నరికి చంపిన బాలికలు!