అధునాతన జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వేలా (INS vela submarine) అందుబాటులో వచ్చింది. ముంబయిలోని నావల్ డాక్ యార్డులో నావికాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్ (admiral karambir singh) సమక్షంలో ఐఎన్‌ఎస్ వేలా విధుల్లోకి చేరింది. ప్రస్తుత సంక్లిష్ట భద్రతా పరిస్థితుల్లో ఐఎన్‌ఎస్ వేలా తన సామర్థ్యం(INS vela efficiency), ఆయుధ సంపత్తితో భారత తీర ప్రాంతాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని.. అడ్మిరల్ కరంబీర్ సింగ్ తెలిపారు.


భారత్‌కు ఉన్న స్టెల్త్ స్కార్పీన్ శ్రేణి(scorpene submarine of india) జలాంతర్గాముల్లో ఐఎన్‌ఎస్ వేలా నాలుగోది. ఫ్రాన్స్ నావల్ గ్రూప్‌తో కలిసి ముంబయిలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్(mazagon dock shipbuilders) ఈ ఆధునికమైన జలాంతర్గామిని తయారుచేసింది. సముద్ర యుద్ధరీతుల్లో ఐఎన్‌ఎస్ వేలా అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఆధునిక టార్పెడోలు, క్షిపణులు ప్రయోగించగల సామర్థ్యం ఈ జలాంతర్గామి సొంతం.



దేశీయంగా నిర్మించిన బ్యాటరీలను, ఆధునిక కమ్యూనికేషన్ల సూట్‌ను తొలిసారిగా ఐఎన్‌ఎస్ వేలాలో అమర్చారు. విధుల్లోకి ప్రవేశపెట్టిన అనంతరం జలాంతర్గామిని నావికాదళపతి ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు.
ఇవీ చదవండి: