సింధు నదీ జలాల ఒప్పందంపై భారత్- పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండురోజుల సమావేశాలు ముగిశాయి. జమ్ముకశ్మీర్‌లో భారత్ నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టులపై, లద్దాఖ్‌లోని ఓ ప్రాజెక్టుపై ఈ సమావేశాల సందర్భంగా పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీటిపై భారత్ కూడా తన వాదనలు వినిపించించింది.
జమ్ముకశ్మీర్‌లోని పకల్ దుల్(1000 మెగా వాట్), లోవర్ కల్మయ్(48 మెగా వాట్) జలవిద్యుదుత్పత్తి కేంద్రాల డిజైన్లు సింధు నదీ జలాల ఒప్పందానికి అనుగుణంగానే ఉన్నాయని పాక్‌కు స్పష్టత ఇచ్చింది భారత్. లద్ధాఖ్‌లో చేపట్టనున్న ప్రాజెక్టుల నిర్వహణపైనా వివరణ ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
చివరిసారిగా ఈ సమావేశాలు 2018లో లాహోర్‌లో జరిగాయి. గత నెల భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఈ సమావేశాలకు భారత్ ఆతిథ్యమివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చదవండి:నాపై దర్యాప్తు చేపట్టండి: దేశ్‌ముఖ్