ETV Bharat / bharat

దేశంలోనే అతిపెద్ద వజ్రాల గని ఇదే... - మూడు కోట్ల వజ్రాలతో అతిపెద్ద గని

దేశంలోనే అతిపెద్ద వజ్రాల గని మధ్యప్రదేశ్​లో బయటపడింది. 62.63 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 3.42 కోట్ల వజ్రాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. మూడు లక్షలకు పైగా చెట్లను నరికి.. ఈ వజ్రాలను వెలికితీయనున్నారు.

largest diamond mine in india
వజ్రాల గని
author img

By

Published : Apr 8, 2021, 7:07 PM IST

దేశంలోనే అతిపెద్ద వజ్రాల గని మధ్యప్రదేశ్​లోని ఛతర్​పుర్​లో బయటపడింది. జిల్లాలోని బక్స్వాహా అటవీ ప్రాంతంలో దాదాపు 3.42 కోట్ల వజ్రాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ వజ్రాలను వెలికితీసే బాధ్యతను బిర్లా గ్రూప్​నకు కట్టబెట్టింది మధ్యప్రదేశ్ సర్కార్. ఈ ప్రాంతాన్ని 50 ఏళ్ల పాటు ఈ సంస్థకు లీజుకు ఇచ్చింది.

20 ఏళ్ల క్రితం సర్వే

బక్స్వాహాలో వజ్రాల అన్వేషణ కోసం 20 ఏళ్ల క్రితం సర్వే చేపట్టారు. 'బందర్ డైమండ్ ప్రాజెక్ట్'.. ఈ సర్వే నిర్వహించి, 62.64 హెక్టార్లలో వజ్రాల ఉనికిని నిర్ధరించింది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఇక్కడి భూములను వేలం వేసింది. ఆదిత్యా బిర్లా గ్రూప్ అత్యధికంగా బిడ్ వేసింది. దీంతో 50 ఏళ్ల పాటు ఈ భూములు ఆదిత్యా బిర్లా గ్రూప్​నకు లీజుకు ఇవ్వనుంది ప్రభుత్వం.

"ఆదిత్యా బిర్లా గ్రూప్.. తమ క్వారీని ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టుపై రూ. 2,500 కోట్లను ఖర్చు చేయనుంది. రియో టింటో అనే ఆస్ట్రేలియా కంపెనీ ఈ ప్రాజెక్టుపై పనిచేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వారు తప్పుకున్నారు."

-అజయ్ మిశ్రా, ఖనిజ విభాగం అధికారి

బక్స్వాహా అటవీ ప్రాంతంలో పచ్చలతో పోలిస్తే వజ్రాలు 15 రెట్లు అధికంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇక్కడి వజ్రాల నాణ్యత కూడా చాలా మెరుగ్గా ఉంటుందని తెలిపారు. ఇక్కడ వెలికితీసిన వజ్రాలు ఆసియా దేశాలకు సరఫరా అవుతాయని అంటున్నారు.

3 లక్షల చెట్లు నరికి...

వజ్రాలను బయటకు తీసేందుకు భారీ సంఖ్యలో చెట్లను నరికేయనున్నారు. 3 లక్షలకు పైగా వృక్షాలను తొలగించనున్నారు. వందల ఎకరాల అటవీ ప్రాంతంలోని చెట్లన్నింటినీ నరికేయనున్నారు. ఇందులో 50 వేల వరకు టేకు చెట్లు ఉంటాయని అంచనా. వీటికి అదనంగా పీపాల్, టెండు, జామున్, బహేరా, అర్జున్, పలాశ్ వంటి వేలాది ఔషధ వృక్షాలూ.. వజ్రాల వేటకు బలి కానున్నాయి.

వన్యప్రాణులు లేవా?

బక్స్వాహాలో వేలాది చెట్లను నరికేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే, వన్యప్రాణుల విషయంపై అటవీ శాఖ ఇచ్చిన నివేదికలు అనుమానాస్పదంగా మారాయి. రియో టింటో సంస్థ 2017లో సమర్పించిన నివేదిక ప్రకారం బక్స్వాహా అడవిలో అనేక వన్యప్రాణుల వివరాలు పొందుపర్చారు. చిరుతలు, పులులు, ఎలుగుబంట్లు, రెయిన్ డీర్, జింకలు, కుందేళ్లు, నెమళ్లు సహా అనేక జంతువులు ఉన్నాయని వెల్లడించారు. కానీ, మధ్యప్రదేశ్ అటవీ శాఖ రూపొందించిన తాజా నివేదికలో మాత్రం ఇక్కడ ఎలాంటి వన్యప్రాణులు లేవని పేర్కొన్నారు.

ఇదివరకు విడుదల చేసిన నివేదిక ఏ ప్రాతిపదికన తయారుచేశారో తెలియదని ప్రస్తుతం ఉన్న అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై విచారణ పెండింగ్​లో ఉందని తెలిపారు. మరోవైపు, తొలగించిన చెట్లకు సమాన సంఖ్యలో మొక్కలు నాటేలా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.