ETV Bharat / bharat

భారత్​ మరో ఘనత- టీకా పంపిణీ@70కోట్లు - India’s COVID-19 vaccination coverage

Vaccination record
వ్యాక్సినేషన్​ రికార్డు
author img

By

Published : Sep 7, 2021, 8:31 PM IST

Updated : Sep 7, 2021, 10:28 PM IST

20:27 September 07

భారత్​ మరో ఘనత- టీకా పంపిణీ@70కోట్లు

దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. దేశంలో టీకా పంపిణీ 70 కోట్ల మార్కును అందుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు 67లక్షల టీకాలు పంపిణీ చేసినట్టు వెల్లడించింది. దీంతో మొత్తం టీకాల సంఖ్య 70,63,55,796కి చేరినట్టు స్పష్టం చేసింది.

రోజుకు కోటి టీకాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది భారత్​. ఈ క్రమంలో 11రోజుల వ్యవధిలో ఇప్పటికే మూడుసార్లు ఆ ఘనతు సాధించింది.

కేరళలో 25వేల కేసులు

కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత ఐదు రోజులుగా 30వేలలోపే నమోదవుతున్నయి. మంగళవారం కొత్తగా 25,772 కేసులు, 189 మరణాలు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 15.87 శాతంగా నమోదైంది. 27,320 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,37,045 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.  

రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత..

కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో రాత్రి కర్ఫ్యూను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఆదివారాల్లో లాక్​డౌన్​ సైతం ఉపసహరించుకుంటున్నట్లు సీఎం పినరయి విజయన్​ తెలిపారు. కొవిషీల్డ్​ రెండో డోసుపై హైకోర్టు ఆదేశాలను పాటిస్తామన్నారు. అలాగే.. ఉన్నత విద్యాసంస్థలను అక్టోబర్​ 4 నుంచి తెరుస్తున్నట్లు కొవిడ్​పై సమీక్షా సమావేశం అనంతరం ప్రకటించారు సీఎం. సాంకేతిక, పాలీ టెక్నిక్​, మెడికల్​, డిగ్రీ, పీజీ కోర్టుల్లోని చివరి సంవత్సరం క్లాసులు ప్రారంభమవుతాయన్నారు. క్లాసులకు హాజరుకావాలనుకుంటున్న విద్యార్థులు ఉపాధ్యాయులు కనీసం ఒక్కడోసైనా టీకా తీసుకోవాలని సచించారు.  

ఇతర రాష్ట్రాల్లో కొవిడ్​ కేసుల వివరాలు..

  • మహారాష్ట్రలో మంగళవారం కొత్తగా 3,898 కరోనా కేసులు నమోదయ్యాయి. 86 మంది వైరస్​కు బలయ్యారు. 3.581 మంది వైరస్​ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. సోమవారంతో పోలిస్తే కొత్త కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి.  
  • తమిళనాడులో మంగళవారం కొత్తగా 1,544 మందికి వైరస్​ సోకింది. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసుల్లో నాలుగు జిల్లాలు కోయంబత్తూర్​, చెన్నై, చెంగల్​పట్టు, ఈరోడ్​లలోనే అధికంగా ఉన్నాయి. సెప్టెంబర్​ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్​ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం.  
  • దిల్లీలో ఈనెలలో తొలి కొవిడ్​ మరణం నమోదైంది. కొత్తగా 50 మందికి వైరస్​ సోకింది. పాజిటివిటీ రేటు 0.07గా ఉంది. 30 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.  
  • కర్ణాటకలో 851 మందికి కొత్తగా వైరస్​ సోకింది. 15 మంది బలయ్యారు. 790 మంది కోలుకున్నారు.

Last Updated : Sep 7, 2021, 10:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.