ETV Bharat / bharat

ఐఓసీఎల్​లో ఉద్యోగ అవకాశాలు- వీరే అర్హులు! - ఐఓసీఎల్ ఉద్యోగాలు

ఇంజినీర్​, ఆఫీసర్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్​. పూర్తిగా ఆన్​లైన్​ ద్వారా జరిగే ఈ నియామకాలకు.. గేట్ పరీక్షలో అర్హత సాధించిన వారు అర్హులు. దరఖాస్తుకు జులై 26 చివరి తేది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు..

indian-oil-corporation-limited-is-hiring-through-the-gate-2021-score
ఐఓసీఎల్​లో ఉద్యోగ అవకాశాలు- జులై 26 చివరి తేది
author img

By

Published : Jul 14, 2021, 5:33 PM IST

గేట్​-2021 పరీక్షలో అర్హత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఇండియన్​ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్​. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకునేందుకు జులై 26 వరకు గడువుచ్చింది. ఈసారి నియామక ప్రక్రియ అంతా ఆన్​లైన్​లోనే జరగనుంది.

ఇంజినీర్లు, ఆఫీసర్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్​ ఇంజినీర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నియామకం చేపట్టింది ఐఓసీఎల్​. కెమికల్ ఇంజినీరింగ్​, సివిల్ ఇంజినీరింగ్​, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇన్​స్ట్రుమెంటేషన్​ ఇంజినీరింగ్​, మెకానికల్ ఇంజినీరింగ్​ విభాగంలో గేట్​-2021 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారే ఈ పోస్టులకు అర్హులు. ఇతర విభాగాల వారు, గతంలో నిర్వహించిన గేట్ పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసినా పరిగణనలోకి తీసుకోరు.

దరఖాస్తు చేసిన వారిలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు గ్రూప్​ డిస్కషన్​, గ్రూప్ టాస్క్ నిర్వహిస్తారు. చివరగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.

దరఖాస్తు ఎలా?

  • ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక ఐఓసీఎల్ వెబ్​సైట్లో నోటిఫికేషన్​ను క్షుణ్నంగా చదవాలి
  • మొదటగా ఓ ఈమెయిల్​, మొబైల్ నంబర్​తో ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక వీటిని మార్చడానికి వీల్లేదు.
  • రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక అప్లికేషన్ లింక్​పై క్లిక్ చేయాలి. సూచనలన్నీ చదవాలి.
  • దరఖాస్తుకు అవసరమైన కలర్ ఫొటో(6 నెలల లోపు దిగింది), సంతకం స్కాన్ చేసిన పత్రాలు ఉండాలి. ఆధార్ కార్డ్​ కూడా అవసరం.
  • గేట్​-2021 రిజిస్ట్రేషన్​ నంబర్, ఇంజినీరింగ్ విభాగం, స్కోరు వివరాలను నమోదు చేయాలి.
  • రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులైతే సంబంధిత ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలి. లేకపోతే దరఖాస్తు చెల్లదు.

ఇదీ చూడండి: Neet 2021: 'నీట్'​ పీజీ పరీక్ష తేదీ ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.