Anti Ship Missile Tests Success: భారత నావికాదళం బుధవారం నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఒడిశా బాలేశ్వర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో(ఐటీఆర్) ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి నౌకాదళ యాంటీ షిప్ క్షిపణి.. తొలి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని అధికారులు తెలిపారు. "ఈ క్షిపణి ప్రయోగం సాంకేతికతలో స్వావలంబన సాధించడానికి ఒక ముఖ్యమైన ముందడుగు" అని నేవీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారత నౌకాదళం.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)తో కలిసి ఈ పరీక్షను నిర్వహించింది.

సీకింగ్ 42బి హెలికాప్టర్ ద్వారా క్షిపణిని ప్రయోగిస్తున్న వీడియోను ట్విట్టర్‌లో భారత నావికాదళం షేర్ చేసింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి.. యాంటీ-షిప్ వెర్షన్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒక నెల తర్వాత కొత్త క్షిపణిని పరీక్షించింది.

-
This firing is a significant step towards achieving self-reliance in niche missile technology and reaffirms the #IndianNavy's commitment to indigenisation (2/2)#CombatReady #Credible#FutureProofForce@AmritMahotsav @mygovindia @drajaykumar_ias @PBNS_India @DDNewslive @PIB_India
— SpokespersonNavy (@indiannavy) May 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">This firing is a significant step towards achieving self-reliance in niche missile technology and reaffirms the #IndianNavy's commitment to indigenisation (2/2)#CombatReady #Credible#FutureProofForce@AmritMahotsav @mygovindia @drajaykumar_ias @PBNS_India @DDNewslive @PIB_India
— SpokespersonNavy (@indiannavy) May 18, 2022This firing is a significant step towards achieving self-reliance in niche missile technology and reaffirms the #IndianNavy's commitment to indigenisation (2/2)#CombatReady #Credible#FutureProofForce@AmritMahotsav @mygovindia @drajaykumar_ias @PBNS_India @DDNewslive @PIB_India
— SpokespersonNavy (@indiannavy) May 18, 2022
భారత నౌకాదళానికి చెందిన రెండు ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ ఉదయగిరి అనే నౌకలను ముంబయిలోని మజాగాన్ డాక్స్ లిమిటెడ్(ఎండీఎల్)లో ప్రారంభించారు. ఐఎన్ఎస్ సూరత్ పీ15బి తరగతికి చెందిన నాలుగో గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్ కాగా, ఐఎన్ఎస్ ఉదయగిరి పీ17ఏ తరగతికి చెందిన రెండవ స్టెల్త్ ఫ్రిగేట్.
ఇవీ చదవండి: