ETV Bharat / bharat

విదేశాల నుంచి ఆక్సిజన్ తెచ్చేందుకు 7 యుద్ధ నౌకలు

దేశంలో ప్రాణవాయువు కొరతను అధిగమించేందుకు.. విదేశాల నుంచి ఆక్సిజన్​తో నిండిన క్రయోజనిక్ కంటైనర్లను తీసుకురావడానికి భారత నావికాదళం ఏడు యుద్ధనౌకలను మోహరించింది. ద్రవ ఆక్సిజన్, దాని అనుబంధ వైద్య పరికరాలను తీసుకురావడానికి కోల్‌కతా, కొచ్చి, తల్వార్, తబార్, త్రికండ్, జలష్వా, ఐరావత్ నౌకలను మోహరించింది.

WARSHIPS
యుద్ధ నౌకలు
author img

By

Published : May 2, 2021, 6:44 AM IST

కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున భారతదేశం అంతటా ఆస్పత్రులు మెడికల్​ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీనిని అధిగమించేందుకు విదేశాల నుంచి ఆక్సిజన్​ నిండిన క్రయోజెనిక్ కంటైనర్లను తీసుకురావడానికి భారత నావికాదళం ఏడు యుద్ధనౌకలను మోహరించింది.

'సముద్ర సేతు- II' ఆపరేషన్​లో భాగంగా విదేశాల నుంచి ద్రవ ఆక్సిజన్, దాని అనుబంధ వైద్య పరికరాలను తీసుకురావడానికి మోహరించిన ఓడలు కోల్‌కతా, కొచ్చి, తల్వార్, తబార్, త్రికాండ్, జలాష్వా, ఐరావత్.

బహ్రెయిన్‌లోని మనమా నుంచి ఐఎన్‌ఎస్ తల్వార్ 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను తీసుకువస్తుండగా, ఐఎన్‌ఎస్ కోల్‌కతా వైద్య సామాగ్రిని సేకరించడానికి దోహాకు వెళ్లిందని భారత నావికాదళం తెలిపింది. ద్రవ ఆక్సిజన్ ట్యాంకులను తీసుకురావడానికి ఓడ కువైట్ బయలుదేరుతుంది.

అరేబియా సముద్రంలో మోహరించిన కొచ్చి, త్రికండ్​, టాబర్ మిషన్లతో కూడిన రెండవ బ్యాచ్ ఓడలు కూడా ఈ ఆపరేషన్​లో పాలుపంచుకోవడానికి రంగంలోకి దిగాయి. దక్షిణ నావికాదళం నుంచి, ల్యాండింగ్ షిప్ ట్యాంక్ ఐఎన్ఎస్ షార్దుల్ 48 గంటల్లో ఆపరేషన్లో చేరడానికి సిద్ధంగా ఉంది అని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది.

వందే భారత్​ మిషన్​..

గత సంవత్సరం, భారత నావికాదళం వందే భారత్ తరలింపు మిషన్లో భాగంగా ఆపరేషన్ సముద్ర సేతును ప్రారంభించింది, దీని కింద మాల్దీవులు, శ్రీలంక, ఇరాన్ నుంచి ఒంటరిగా ఉన్న 4,000 మంది భారతీయులను తీసుకువచ్చింది.

కరోనా మహమ్మారిపై పోరులో భారతదేశానికి సహాయం ప్రకటించిన ప్రముఖ దేశాల్లో.. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, బెల్జియం, రొమేనియా, లక్సెంబర్గ్, సింగపూర్, పోర్చుగల్, స్వీడన్, న్యూజిలాండ్, కువైట్, మారిషస్ ఉన్నాయి.

ఇదీ చదవండి:'ఆక్సిజన్​ కోసం ఆపరేషన్​ సముద్ర సేతు-2'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.