Indian Navy Apprentice Jobs 2023 : ఇండియన్ నేవీ ఆధ్వర్యంలోని విశాఖపట్నం డాక్యార్డ్ అప్రెంటీస్ స్కూల్ 275 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్రెంటీస్ పోస్టుల వివరాలు
Vizag Naval Dockyard Apprentice Posts :
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 36 పోస్టులు
- ఫిట్టర్ - 33 పోస్టులు
- షీట్ మెటల్ వర్కర్ - 33 పోస్టులు
- కార్పెంటర్ - 27 పోస్టులు
- మెకానిక్ (డీజిల్) - 23 పోస్టులు
- పైప్ ఫిట్టర్ - 23 పోస్టులు
- ఎలక్ట్రీషియన్ - 21 పోస్టులు
- పెయింటర్ (జనరల్) - 16 పోస్టులు
- R & A/C మెకానిక్ - 15 పోస్టులు
- వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) - 15 పోస్టులు
- మెషినిస్ట్ - 12 పోస్టులు
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ - 10 పోస్టులు
- మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ - 5 పోస్టులు
- మొత్తం పోస్టులు - 275
విద్యార్హతలు
Vizag Naval Dockyard Apprentice Eligibility : అభ్యర్థులు 10వ తరగతిలో 50% మార్కులతో, ఐటీఐ (NCVT/SCVT)లో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
Visakhapatnam Naval Dockyard Apprentice Age Limit : అభ్యర్థుల కనీస వయస్సు 14 ఏళ్లు ఉండాలి. కానీ ప్రమాదకరమైన ట్రేడులకు మాత్రం కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయస్సుపై ఎలాంటి పరిమితి లేదు.
దరఖాస్తు రుసుము
Vizag Naval Dockyard Apprentice Application Fee : అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం
Visakhapatnam Naval Dockyard Apprentice Application Fee :
- స్టేజ్ 1 : ముందుగా 10వ తరగతి, ఐటీఐల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- స్టేజ్ 2 : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
- స్టేజ్ 3 : రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ చేస్తారు.
- స్టేజ్ 4 : ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వేరిఫికేషన్ నిర్వహిస్తారు. తరువాత..
- స్టేజ్ 5 : అభ్యర్థులకు ఓరల్ టెస్ట్/ స్కిల్ టెస్ట్ పెడతారు.
- స్టేజ్ 6 : ఈ అన్ని స్టేజ్లను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు.. మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
స్టైపెండ్
Naval Dockyard Apprentice Salary : అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8,050 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం
Visakhapatnam Naval Dockyard Apprentice Application Process :
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.apprenticeshipindia.gov.in/ ఓపెన్ చేయాలి.
- వెబ్సైట్లో మీ పేరుపై రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ అయిన తరువాత ముఖ్యమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
- చివరిగా అన్ని వివరాలను సరిచూసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
Visakhapatnam Naval Dockyard Apprentice Apply Last Date :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 నవంబర్ 18
- దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జనవరి 1
- పరీక్ష తేదీ : 2024 ఫిబ్రవరి 28
- రాత పరీక్ష ఫలితాలు - వెల్లడి తేదీ : 2024 మార్చి 2
- ఇంటర్వ్యూ తేదీ : 2024 మార్చి 5-8
- ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చే తేదీ : 2024 మార్చి 14
- మెడికల్ ఎగ్జామ్ తేదీ : 2024 మార్చి 16 నుంచి..
ఐటీఐ అర్హతతో రైల్వేలో 1104 అప్రెంటీస్ జాబ్స్- అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?
డిగ్రీ అర్హతతో AAICLASలో 906 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!