ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: ఆంగ్లేయులపై తెల్లోడి తిరుగుబాటు - తెల్లవారి తిరుగుబా

Indian Independence: సిపాయిల తిరుగుబాటును విజయవంతంగా అణచివేసి.. భారత్‌లో పాలన పగ్గాలను నేరుగా చేపట్టిన బ్రిటిష్‌ ప్రభుత్వానికి వెంటనే అనుకోని కొత్త సమస్య ఎదురైంది. అదే మరో తిరుగుబాటు. అదీ తమ ఆంగ్లేయుల నుంచే తలెత్తటం వారిని ఆశ్చర్యపరచింది. 1858 నవంబరు 1న అలహాబాద్‌ దర్బార్‌లో లార్డ్‌ కానింగ్‌ ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అంతేగాకుండా.. అప్పటిదాకా ఉన్న ఈస్టిండియా కంపెనీ సైన్యాన్ని రద్దు చేసి.. బ్రిటన్​ రాణి సైన్యంలో విలీనం చేశారు. ఇలా చేయడం బ్రిటిష్​ సైన్యానికి నచ్చక.. తిరుగుబాటు బావుటా ఎగరవేశారు.

Indian Independence
తెల్లోడి తిరుగుబాటు
author img

By

Published : Jan 4, 2022, 7:02 AM IST

Indian Independence: వేలూరు తిరుగుబాటు, సంతాల్‌ తిరుగుబాటు.. సిపాయిల తిరుగుబాటు.. జాతీయోద్యమంలోకి తొంగిచూస్తే ఇలా చాలా తిరుగుబాట్లు కనిపిస్తాయి. వీటన్నింటితో పాటు... తమ ప్రభుత్వంపై తామే ఎదురుతిరిగిన తెల్లవారి తిరుగుబాట్లు కూడా కొన్ని ఉన్నాయి.

ఈస్టిండియా కంపెనీ పాలనలో.. 1766లో బెంగాల్‌లో తొలిసారి తెల్లవారి తిరుగుబాటు చోటుచేసుకుంది. 1799లో మద్రాసులో రెండోది. ఈ రెండు సందర్భాల్లోనూ... ఆంగ్లేయ సైనికులు తమ జీతభత్యాల్లో వ్యత్యాసంపై సొంత ప్రభుత్వంపైనే తిరగబడ్డారు. వీటి ప్రభావం భారత్‌పై పెద్దగా లేకున్నా.. 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామం (సిపాయిల తిరుగుబాటు) తర్వాత తలెత్తిన తెల్ల తిరుగుబాటు.. దాని పరిణామాలు భారత్‌పై పడ్డాయి. నేటికీ కొనసాగుతున్నాయి.

సిపాయిల తిరుగుబాటును విజయవంతంగా అణచివేసి... భారత్‌లో పాలన పగ్గాలను నేరుగా చేపట్టిన బ్రిటిష్‌ ప్రభుత్వానికి వెంటనే అనుకోని కొత్త సమస్య ఎదురైంది. అదే మరో తిరుగుబాటు. అదీ తమ ఆంగ్లేయుల నుంచే తలెత్తటం వారిని ఆశ్చర్యపరచింది. 1858 నవంబరు 1న అలహాబాద్‌ దర్బార్‌లో లార్డ్‌ కానింగ్‌ ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అంతేగాకుండా... అప్పటిదాకా ఉన్న ఈస్టిండియా కంపెనీ సైన్యాన్ని కూడా రద్దు చేసి... రాణి సైన్యంలో విలీనం చేశారు. అదే అసంతృప్తికి, తిరుగుబాటుకు మూలమైంది. కారణం... అప్పటిదాకా (1861 దాకా కూడా) భారత్‌లో రెండు సైన్యాలుండేవి. ఒకటి బ్రిటన్‌ ఆధ్వర్యంలో పనిచేసేది. ఇందులోని వారంతా పూర్తిగా బ్రిటిష్‌ సైన్యంలోని వారే! ఇక రెండోది... ఈస్టిండియా కంపెనీ సైన్యం. భారత్‌లో పనిచేసేందుకు భర్తీ చేసుకున్న అనేక మంది యూరోపియన్ల సమూహమిది. భారతీయులతో కూడిన స్థానిక రెజిమెంట్లు కూడా ఈ కంపెనీ సైన్యంలో భాగమే. రాణి సైన్యంలోని సైనికాధికారులను ఉన్నతంగా పరిగణించేవారు. కంపెనీ సైన్యాన్ని ద్వితీయశ్రేణిగా చూసేవారు. రాణి సైన్యంలోని సైనికాధికారులు డబ్బులిచ్చి తమ పదవుల్ని కొనుక్కునేవారు. తద్వారా సీనియారిటీ కోసం ఎదురు చూడకుండా పదోన్నతి లభించేది. (అలాంటి సంప్రదాయం 1870 దాకా ఇంగ్లాండ్‌లో కొనసాగింది.) కంపెనీ సైన్యంలో మాత్రం సీనియారిటీ ఆధారంగా పదోన్నతులుండేవి. జీతభత్యాల పరంగా కంపెనీ సైన్యానికే ఎక్కువ మొత్తం లభించేది. ఉన్నపళంగా తమను ఏకపక్షంగా రాణి సైన్యంలో కలపటంతో నష్టమంటూ... చేరటానికి వారు నిరాకరించారు. దీనికి తోడు... ఈస్టిండియా కంపెనీ సైనికులు చేతగానివారని, అనారోగ్యవంతులని, క్రమశిక్షణ రహితులని... బ్రిటిష్‌ పత్రికల్లో రాయటం వారిని మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో వారు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి సహాయ నిరాకరణకు దిగారు. అసలే సిపాయిల తిరుగుబాటు అణచివేత తర్వాత భారతీయుల నుంచి ఎలాంటి ప్రతీకారం ఎదురవుతుందోనని ఆందోళన చెందుతున్న బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఇదో తలనొప్పిగా మారింది. ఎలాగోలా సర్దిచెప్పటానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరకు... భత్యాలు ఎక్కువ వచ్చేలా హామీ ఇవ్వటంతో పాటు లండన్‌ తిరిగి వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో... 10వేల మందికిపైగా కంపెనీ సైనికులు స్వదేశం బయల్దేరి వెళ్లారు.

ఆ దెబ్బ భారత్‌పై..

సిపాయిల తిరుగుబాటుకు ఈ సంఘటన కూడా తోడవటంతో... ఆ తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం భారత్‌లో సైనిక దళాల కూర్పునే సమూలంగా మార్చేసింది. ఎక్కడా ఏమాత్రం అసంతృప్తి, తిరుగుబాటుకు వీల్లేకుండా ప్రణాళిక రచించింది. విభజించు పాలించు సూత్రాన్ని ప్రవేశపెట్టింది. జొనాథన్‌ పీల్‌ కమిషన్‌ వేసి... బ్రిటిష్‌ ప్రభుత్వానికి విశ్వాసపాత్రులుగా ఉండే సామాజిక గ్రూపులను ఎంపిక చేసి సైన్యంలోకి వారిని భర్తీ చేయటం మొదలెట్టింది. కులాలు, జాతుల వారీగా రెజిమెంట్లు ఏర్పాటు చేసింది. వీటిలోనూ... ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ అంటూ ప్రాధాన్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పంజాబ్‌, బలూచిస్థాన్‌, గోర్ఖా, డోగ్రాలను పోరాట వీరులుగా... బెంగాల్‌, మద్రాసు, ముంబయి రెజిమెంట్లను వారికంటే తక్కువ స్థాయివారిగా చూసేవారు. అన్ని రెజిమెంట్లలోనూ వివిధ కులాలు, జాతులను ఉంచేవారు. ఏ ఒక్కరూ కలవకుండా జాగ్రత్తపడ్డారు. శరీరదారుఢ్యం కంటే... జాతి, కులం, విశ్వసనీయత ఆధారంగా భర్తీ జరిగేది. నిమ్నకులాల వారిని కూడా తీసుకున్నా.. అవసరం తీరగానే వారిని తొలగించేవారు. మహారాష్ట్రలో మహర్‌లను తొలుత భర్తీ చేసుకొన్న బ్రిటిష్‌ ప్రభుత్వం... మొదటి ప్రపంచ యుద్ధం కాగానే ఆ రెజిమెంట్‌ను రద్దు చేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మళ్లీ తీసుకున్నారు. ఇలా అవసరార్థం వాడుకొని వదిలేయటంపై అంబేడ్కర్‌ బ్రిటిష్‌ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.

ఇదీ చూడండి:

Azadi Ka Amrit Mahotsav: తెల్లవారి సొమ్ముతో ప్రేమ్​ ఖన్నా విప్లవారాధన

Azadi Ka Amrit Mahotsav: భారత్​పై పెత్తనం కోసం ఆంగ్లేయుల 'లీగ్‌' ఆట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.