ETV Bharat / bharat

భాజపా నేతల వ్యాఖ్యలతో చిక్కులు.. భారత దౌత్య సమర్థతకు అగ్ని పరీక్ష

Nupur Sharma comments: మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా నాయకులు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యలు.. భారత్​ దౌత్య సమర్థతకు పరీక్ష పెట్టాయి. ముఖ్యంగా ఇంధన అవసరాలతో పాటు అనేక విషయాల్లో పాకిస్థాన్ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు పశ్చిమాసియాదేశాలతో స్నేహం, సహకారం ఎంతో కీలకమైన పరిస్థితుల్లో వీరివురి వ్యాఖ్యలు భారత్​ను ఇబ్బందుల్లోకి నెట్టివేశాయి. ముస్లిం మత విశ్వాసాలు ప్రబలంగా ఉండే పశ్చిమాసియా దేశాలు భారతీయ ఉత్పత్తులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

Nupur Sharma
నుపుర్ శర్మ
author img

By

Published : Jun 7, 2022, 9:51 AM IST

Nupur Sharma comments: దేశ ఇంధన అవసరాలతో పాటు అనేక విషయాల్లో పాకిస్థాన్‌ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు పశ్చిమాసియాదేశాలతో స్నేహం, సహకారం ఎంతో కీలకమైన పరిస్థితుల్లో.. భాజపా నాయకులు నుపుర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌లు మహమ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు.. మన దేశ దౌత్య సమర్థతకు విషమ పరీక్ష పెట్టాయి. గల్ఫ్‌ దేశాలతో సఖ్యత కోసం దశాబ్దాలుగా కొనసాగిస్తున్న యత్నాలను తాజా పరిణామం ఒక్కసారిగా ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. ఇస్లామిక్‌ సహకార సంస్థ(ఓఐసీ), పాకిస్థాన్‌ విమర్శలను విదేశీ వ్యవహారాల శాఖ గట్టిగా తిప్పికొట్టినప్పటికీ ముస్లిం దేశాల మనోభావాలకు తగిలిన గాయాన్ని ఎంత త్వరగా మాన్పగలమన్నది మన దౌత్య అధికారుల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. తాజా వివాదం వివిధ రంగాలపై తక్షణ ప్రభావం చూపగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • ముస్లిం మత విశ్వాసాలు ప్రబలంగా ఉండే పశ్చిమాసియా దేశాలు భారతీయ ఉత్పత్తులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. మన దేశం నుంచి వెళ్లే కార్మికులకు వీసాల జారీని నియంత్రించడానికి ప్రయత్నించవచ్చు. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)ల నుంచి మన దేశానికి వస్తాయని ఆశిస్తున్న పెట్టుబడుల్లో ఆలస్యం జరగవచ్చు.
  • జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే అధికరణం 370ని రద్దు చేసినప్పుడు ముస్లిం దేశాలు కొన్ని మాత్రమే భారత్‌కు వ్యతిరేకంగా స్పందించాయి. అటువంటి పరిస్థితుల్లోనూ పశ్చిమాసియాకు చెందిన మిత్ర దేశాలు పాకిస్థాన్‌ మాటలను విశ్వసించలేదు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదని పేర్కొన్నాయి. ప్రతికూలంగా స్పందించిన మలేసియా నుంచి పామాయిల్‌ దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ 2020లో భారత్‌ తగు సమాధానం ఇచ్చింది. అయితే, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా ముస్లిం దేశాలను కూడగడుతున్న సమయంలో తాజా వివాదం ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న మాల్దీవులపై భారత్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడానికి ఈ వివాదం ఓ కారణం కావచ్చు.
  • కశ్మీర్‌ అంశంలో పాకిస్థాన్‌ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టడంలో, ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందకుండా నిరోధించడంలో పలు గల్ఫ్‌ దేశాలు భారత్‌కు సహకరిస్తూ వస్తున్నాయి. మరికొన్ని తటస్థ వైఖరిని కనబరుస్తున్నాయి. ముస్లింల మనోభావాలను తాకేలా చేసిన వ్యాఖ్యలతో భారత్‌ పట్ల ఇప్పటి వరకూ సానుకూల వైఖరితో ఉన్న దేశాల్లోనూ కొంత మార్పు రావచ్చని దిల్లీ యూనివర్సిటీ కళాశాలలో విదేశీ వ్యవహారాల అధ్యాపకుడు కుమార్‌ సంజయ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. తాజా వ్యాఖ్యలతో ఏర్పడిన ప్రతికూల వాతావరణాన్ని ఎంత త్వరగా చక్కదిద్దితే మనదేశానికి అంతమంచిదని ఆయన పేర్కొన్నారు.

ఎవరీ నుపుర్ శర్మ: అంతర్జాతీయ సమాజానికి భారత్‌ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించిన నుపుర్‌ శర్మ(37) వృత్తిరీత్యా న్యాయవాది. దిల్లీ నివాసి అయిన ఆమె ..విద్యార్థి దశ నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆరెస్సెస్‌ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ తరఫున దిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థుల సంఘ ఎన్నికల్లో అధ్యక్షురాలిగా 2008లో ఎన్నికయ్యారు. దిల్లీలోని హిందూ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన నుపుర్‌.. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద విద్యలో పట్టా పొందారు. ఆ తర్వాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. భాజపా యువజన విభాగంలో కొన్నేళ్లు పనిచేసిన తర్వాత భాజపా దిల్లీ విభాగ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై 2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ భాజపాలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన నుపుర్‌ శర్మను భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. శ్రేణులకు శిక్షణ ఇవ్వడంతో పాటు సంస్థాగతమైన పలు బాధ్యతలను భాజపా ఆమెకు అప్పగించింది. వాగ్ధాటి కలిగిన ఆమె టీవీ ఛానళ్లలో జరిగే చర్చా కార్యక్రమాల్లో తన అభిప్రాయాలను గట్టిగా వినిపించేవారు. తాజా వివాదంతో భాజపా నుంచి సస్పెండయ్యారు.

ఇవీ చూడండి: 'నుపుర్​' మాటలపై మంటలు.. ఇస్లామిక్ దేశాల భగ్గు

ఎటువంటి దేశం... ఏమైపోతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.