ETV Bharat / bharat

ఆ 39 మహిళా అధికారులకు శాశ్వత కమిషన్​ హోదా

39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా కల్పిస్తూ భారత ఆర్మీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హోదా కోసం వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. .. నవంబరు 1లోగా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా(Permanent Commission For Women) కల్పించాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Indian Army
భారత ఆర్మీ
author img

By

Published : Oct 29, 2021, 8:46 PM IST

భారత సైన్యంలో మరో 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా(Permanent Commission For Women) దక్కింది. ఈ మేరకు భారత ఆర్మీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఈ హోదా కోసం వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ అధికారిణులకు విజయం లభించింది. నవంబరు 1లోగా మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా(Permanent Commission For Women) కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఏం జరిగిందంటే..?

సైన్యంలో 14ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు 2020 ఫిబ్రవరి 17న తీర్పు వెలువరించింది. ఫలితంగా సైన్యం ఓ కమిటీని ఏర్పాటు చేసి 400 మందికి పైగా మహిళా అధికారులకు ఈ హోదా(Permanent Commission For Women) కల్పించింది. మహిళా అధికారుల వార్షిక రహస్య నివేదిక సమీక్ష ఆధారంగా.. కొందరికే ఈ హోదా నిరాకరించింది. శాశ్వత కమిషన్‌ తిరస్కరణకు గురైన 71 మంది అధికారిణులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 71 మందిలో 39 మంది మహిళా అధికారులు మాత్రమే శాశ్వత కమిషన్‌కు అర్హులుగా గుర్తించినట్లు.. కేంద్రం తెలిపింది. మరో ఏడుగురు వైద్యపరంగా ఫిట్‌గా లేరని, 25 మందిపై క్రమశిక్షణారాహిత్య అభియోగాలున్నాయని పేర్కొంది.

కేంద్రం నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు ఆ 39 మందికి నవంబరు 1 లోగా.. శాశ్వత కమిషన్‌ హోదా కల్పించాలని ఆదేశించింది. మిగతా 25 మంది శాశ్వత కమిషన్‌ను ఎందుకు అనర్హులో కూడా తెలియజేయాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'సుప్రీం' విజయం.. ఆ 39 మందికి శాశ్వత కమిషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.