ETV Bharat / bharat

Helicopter Crash: కూలిన ఆర్మీ హెలికాప్టర్​.. కో-పైలట్​ మృతి - జమ్ముకశ్మీర్​ వార్తలు

Helicopter Crash: జమ్ముకశ్మీర్​లో సైన్యానికి చెందిన హెలికాప్టర్​ కూలింది. సమీపాన ఉన్న ఓ స్థావరం నుంచి సైనికుడిని తరలించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో కో-పైలట్​ ప్రాణాలు కోల్పోయారు.

Helicopter Crash
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్​
author img

By

Published : Mar 11, 2022, 2:08 PM IST

Updated : Mar 11, 2022, 7:23 PM IST

Helicopter Crash: జమ్ముకశ్మీర్​లోని గురేజ్​ సెక్టార్​లోని బారౌమ్​ ప్రాంతంలో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్​ కూలింది. ఈ ఘటనలో కో-పైలట్​ ప్రాణాలు కోల్పోగా.. పైలట్​ గాయాలతో బయటపడ్డారు. మృతిచెందిన కో-పైలట్​.. జైపుర్​కు చెందిన మేజర్ సంకల్ప్​ యాదవ్​ (29)గా అధికారులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన సంకల్ప్​ చికిత్స పొందుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. 2015 నుంచి సంకల్ప్​ యాదవ్​ సైన్యానికి సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సమీపాన ఉన్న ఓ స్థావరం వద్ద అనారోగ్యంతో బాధపడుతున్న సైనికుడిని తరలించేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గుజ్రాన్​ ప్రాంతం వద్దకు హెలికాప్టర్​ చేరుకున్న తర్వాత తమకు సమాచారం అందడం ఆగిపోయిందని పేర్కొన్నారు. హెలికాప్టర్​ శకలాలను హిమపాతం తీవ్రంగా ఉన్న బందిపోరాలోని గుజ్రన్​ నల్లాహ్​ ప్రాంతంలో గుర్తించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి : పైశాచికం.. వీధి కుక్కపై యాసిడ్​ పోసిన పోకిరీలు

Last Updated : Mar 11, 2022, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.