IAF Made In India Projects : స్వదేశీ ఆయుధాలకు పెద్ద పీట వేసేందుకు భారత వాయుసేన సిద్ధమైంది. ఫైటర్ జెట్స్, స్పై ప్లేన్స్, ఛాపర్స్, మిసైల్స్ వంటివి దేశీయంగానే సమకూర్చుకోవాలని నిర్ణయించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మొత్తం రూ.3.15లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్లు భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి వెల్లడించారు. 7 నుంచి 8 సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయనున్నట్లు చౌదరి తెలిపారు.
ఈ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా 180 లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ Mark1A, 156 లైట్ కంబాట్ హెలికాప్టర్లు, లైట్ యుటిలిటీ ఛాపర్స్ను సమీకరించుకోనుంది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. ఇప్పటికే 83 విమానాలకు కాంట్రాక్టులు ఇచ్చింది. మరో 97 ఎయిర్క్రాప్ట్లకు త్వరలోనే క్లియరెన్స్ రానుంది. మరోవైపు, కాలం చెల్లినవిగా భావిస్తున్న మిగ్-21 విమానాల వినియోగాన్ని 2025 నాటికి పూర్తిగా నిలిపివేస్తామని ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి వెల్లడించారు. వాటిని పూర్తిగా మార్క్ 1ఏలతో భర్తీ చేసుకుంటామని చెప్పారు. వీటితో పాటు వివిధ రకాల ఆయుధ వ్యవస్థలను కూడా సిద్ధం చేసుకునేందుకు ఐఏఎఫ్ ప్రణాళికలు రూపొందిస్తోంది. LCA మార్క్1Aల తయారీ విలువ రూ.1.2లక్షల కోట్లకు పైగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
-
#WATCH | To a question by ANI, Indian Air Force (IAF) Chief Air Chief Marshal VR Chaudhari says, "We had signed a contract for 83 LCA Mark 1As. What we are looking at is now to supplement that contract with 97 additional aircraft. So, it will bring the total to 180 LCA Mark… pic.twitter.com/cniRWo5tcp
— ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | To a question by ANI, Indian Air Force (IAF) Chief Air Chief Marshal VR Chaudhari says, "We had signed a contract for 83 LCA Mark 1As. What we are looking at is now to supplement that contract with 97 additional aircraft. So, it will bring the total to 180 LCA Mark… pic.twitter.com/cniRWo5tcp
— ANI (@ANI) October 3, 2023#WATCH | To a question by ANI, Indian Air Force (IAF) Chief Air Chief Marshal VR Chaudhari says, "We had signed a contract for 83 LCA Mark 1As. What we are looking at is now to supplement that contract with 97 additional aircraft. So, it will bring the total to 180 LCA Mark… pic.twitter.com/cniRWo5tcp
— ANI (@ANI) October 3, 2023
ఈ ప్రాజెక్ట్ దేశీయంగా కీలక పరిణామాలకు నాంది పలుకుతుందని రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. దేశీయంగా భారీ డిఫెన్స్ ఇండస్ట్రీని నిర్మించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం వస్తుందని అంటున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నట్లుగా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ఇది మద్దతుగా నిలవచ్చని వారు వివరిస్తున్నారు.
65వేల కోట్లతో Su-30MKI ఫైటర్ జెట్ అప్డేట్..
మొత్తం 65వేల కోట్ల రూపాయలతో Su-30MKI ఫైటర్ జెట్లకు అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. ఇందులో స్వదేశీ రాడార్లు, ఏవియానిక్స్, ఆయుధాలు అమర్చనున్నట్లు వెల్లడించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయనున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఈ అంశం రక్షణ శాఖ పరిధిలో ఉందని.. త్వరలోనే అత్యున్నత స్థాయి సమావేశంలో దీనిపై చర్చ జరుగుతుందని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. మొదట 90 ఎయిర్క్రాప్ట్లను అప్డేట్ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. క్రమంగా మిగతా వాటిని కూడా అప్డేట్ చేయనున్నట్లు తెలిపారు.
స్పై విమానాలు, లైట్ కాంబాట్ హెలికాప్టర్ల అభివృద్ధి..
స్పై విమానాలను కూడా అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైంది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. ఈ విమానాలతో ప్రత్యర్థుల చర్యలను సులువుగా పసిగట్టవచ్చని ఎయిర్‌ఫోర్స్ భావిస్తోంది. అదే విధంగా ఇప్పుడున్న చీతా హెలికాప్టర్ల స్థానంలో లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను తీసుకువచ్చేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రణాళికలు రూపొందిస్తోంది. మొత్తం రూ.45వేల కోట్లతో 156 లైట్ కాంబాట్ హెలికాప్టర్లను తయారు చేయనుంది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అధ్వర్వంలో తయారవుతున్న ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ ప్రోగ్రామ్‌కు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మద్ధతునిస్తోంది.
ప్రాజెక్ట్ కుషా..
ప్రాజెక్ట్ కుషాలో భాగంగా 5 యూనిట్ల లాంగ్ రేంజ్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్‌ను ఎయిర్ ఫోర్స్ తయారు చేయనుంది. రష్యా తయారు చేస్తున్న S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలతో సమానంగా పని చేసే సామర్థ్యం వీటికి ఉందని రక్షణ శాఖ వెల్లడించింది. మొత్తం రూ.21,700 కోట్లను ఈ ప్రాజెక్ట్‌పై ఖర్చు చేసేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. అదే విధంగా 7500 కోట్ల రూపాయలతో ఆయుధ వ్యవస్థను తయారు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. అందుకోసం రక్షణ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది.