ETV Bharat / bharat

'వాతావరణ మార్పులపై భారత్ మరిన్ని చర్యలు' - వాతావరణ మార్పులపై భారత్

అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పులపై పోరాటానికి నిధులు సమకూర్చాలని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. వాతావరణ మార్పులపై భారత్ మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ డ్రయన్​తో దిల్లీలో భేటీ అయిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

prakash javadekar, climate change
'పర్యావరణ రక్షణకు అభివృద్ధి చెందిన దేశాలే నిధులివ్వాలి'
author img

By

Published : Apr 14, 2021, 4:24 PM IST

వాతావరణ మార్పులపై పోరాటంలో భాగంగా భారత్ మరిన్ని చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. అయితే.. ఇతర దేశాల ఒత్తిడితో ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పులపై చర్యలకు ఆర్థికంగా సహకరించాలని భారత్​ ఆశిస్తోందని పేర్కొన్నారు. దిల్లీలోని ఫ్రాన్స్ దౌత్యకార్యాలయం వద్ద ఆ దేశ విదేశాంగ మంత్రి జీన్ డ్రయన్​తో భేటీ అయిన తర్వాత జావడేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"పర్యావరణ పరిరక్షణకు.. పారిస్ ఒప్పందంలో పేర్కొన్న అంశాల కన్నా ఎక్కువే చేశాం. జీ-20 దేశాల్లో ఈ ఒప్పందానికి నిబద్ధతతో కట్టుబడి ఉన్న ఏకైక దేశం భారత్​. చాలా దేశాలు 2020కి ముందు చేసిన వాగ్దానాలు మరిచిపోయాయి. ఇప్పుడు 2050లో మార్పులు తీసుకురావాలని మాట్లాడుతున్నాయి. బొగ్గును వినియోగించమని అంటున్నాయి. కానీ, దానికన్నా చౌకగా లభించే ప్రత్యామ్నాయంపై సందిగ్ధత నెలకొంది."

-ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి

అమెరికా, ఐరోపా, చైనా దేశాల్లో గ్రీన్​హౌస్​ ఉద్గారాల స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల ప్రపంచ దేశాలకు ఇబ్బందులు తప్పడం లేదని జావడేకర్ ఆరోపించారు. ఇందుకే అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ మార్పులకు నిధులు కేటాయించాలని కోరారు.

ఇదీ చదవండి: పడకల కొరత- అంబులెన్సుల్లోనే చికిత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.