ETV Bharat / bharat

ఎట్టకేలకు స్పష్టత.. తాలిబన్లపై భారత్ వైఖరి ఇదే! - తాలిబన్​

తాలిబన్ల వ్యవహారంపై భారత్​ వేచిచూసే ధోరణిని అవలంబించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాలిబన్ల ప్రవర్తన, ప్రభుత్వం ఏర్పాటు వంటి అంశాలను నిశితంగా పరిశీలించాలని భారత్​ భావిస్తున్నట్టు సమాచారం. అయితే అమెరికాతో పాటు అఫ్గాన్​ సైనికులు విడిచిన ఆయుధాలతో తాలిబన్లు మరింత శక్తిమంతంగా మారడం భద్రతాపరంగా ఆందోళకర విషయమని ప్రభుత్వం అభిప్రాయపడింది.

India
ఇండియా
author img

By

Published : Aug 17, 2021, 6:48 PM IST

ఇస్లామిక్​ ఉగ్రవాదానికి అఫ్గానిస్థాన్​ కేంద్రబిందువుగా మారే ప్రమాదం ఉన్నట్టు భారత్​ భావిస్తోంది. ఈ విషయాన్ని అఫ్గాన్​ వ్యవహారాలతో సంబంధం ఉన్న కొందరు అధికారులు మీడియాకు వెల్లడించారు. అమెరికా విడిచిపెట్టి వెళ్లిన ఆయుధాలతో పాటు అప్పటివరకు అఫ్గాన్​ సైనికుల వద్ద ఉన్న తుపాకులతో ఇప్పుడు తాలిబన్లు మరింత శక్తిమంతంగా మారే అవకాశముందని భారత్​ అభిప్రాయపడుతోందన్నారు.

"లష్కరే తోయిబా, లష్కరే ఝాంగ్వి వంటి పాక్​ ఆధారిత ఉగ్ర సంస్థల ఉనికి అఫ్గానిస్థాన్​లోనూ ఉంది. కాబుల్​లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఇతర గ్రామాల్లో చెక్​పోస్టులను ఈ ఉగ్రసంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇస్లామిక్​ ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా అఫ్గానిస్థాన్​ మారే అవకాశం ఉంది. అమెరికా ఆయుధాలతో పాటు 3లక్షలకుపైగా అఫ్గాన్​ సైనికుల ఆయుధాలు వారి చేతికి చిక్కాయి. ఇది భద్రతాపరంగా ఆందోళనకర విషయం."

-- భారత అధికారులు.

తాలిబన్ల ప్రవర్తన, ప్రభుత్వం ఏర్పాటు, అందులోని సభ్యుల తీరు ఏ విధంగా ఉంటుందనే అంశాలను భారత్​ నిశితంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై ఇతర ప్రజాస్వామ్య దేశాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది కూడా కీలకమేనన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:- భారత్‌ కానుక తాలిబన్ల వశం.. పార్కులనూ వదల్లేదు!

ప్రజాస్వామ్య పాలనను ముగింపు పలుకుతూ.. మెరుపు వేగంతో అఫ్గాన్​ను ఆక్రమించుకుని తమ జెండాను ఎగరవేశారు తాలిబన్లు. ఈ క్రమంలో ఆ దేశంలో భయాందోళనలు తారస్థాయికి చేరాయి. ప్రజలు బిక్కుబిక్కమంటూ జీవిస్తుంటే.. మరికొందరు దేశాన్ని విడిచివెళ్లాలని విమానాశ్రయాలకు పరుగులు తీస్తున్నారు. ఈ దృశ్యాలు యావత్​ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.

ఈ క్రమంలో అఫ్గాన్​లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. కాబుల్​ విమనాశ్రయంలో గందరగోళ పరిస్థితుల కారణంగా భారత సీ-17 విమానం తజకిస్థాన్​లో పార్క్​ చేసినట్టు చెప్పాయి. ప్రస్తుతం కాబుల్ ఎయిర్​పోర్ట్​ను పర్యవేక్షిస్తున్న అమెరికా నుంచి అనుమతులు పొందిన వెంటనే విమానం అఫ్గాన్​కు బయలుదేరి అక్కడి ప్రజలకు భారత్​కు తీసుకొచ్చిందని స్పష్టం చేశాయి.

ఈ వ్యవహారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందరికీ ఆహారాన్ని అందించాలని మోదీ అదేశించినట్టు వెల్లడించాయి.

కశ్మీర్​ పరిస్థితేంటి?

కశ్మీర్​ విషయంలో తాలిబన్ల నుంచి పెద్దగా ముప్పు ఉండదని భారత్​ భావిస్తున్నట్టు సమాచారం.

"కశ్మీర్​ ద్వైపాక్షిక అంతర్గత అంశమని తాలిబన్లు ఇప్పటికే గుర్తించారు. తమ వైఖరిని స్పష్టం చేసేశారు. అందువల్ల వారి కన్ను కశ్మీర్​పై పడకపోవచ్చు. అయితే తాలిబన్లను పాక్​ నిఘా సంస్థ ఐఎస్​ఐ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించొచ్చు. ఈ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు తక్కువే. ఏది ఏమైనా అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం."

-- భారత అధికారులు.

ఇదీ చూడండి:- కాబుల్​ నుంచి స్వదేశానికి భారతీయులు- ఎంబసీ సేవలు యథాతథం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.