జులై వరకు 51.6 కోట్ల వాక్సిన్ డోసుల్ని పంపిణీ చేస్తామని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ఇప్పటి వరకు 18 కోట్ల డోసుల్ని అందించామని వెల్లడించారు. ఆగస్టు- డిసెంబర్ నాటికి దేశంలో 216 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యమంత్రులతో సమావేశం నిర్వహించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
డిమాండ్ మేరకు టీకాల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నామని.. వాటిని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిస్తున్నామని స్పష్టం చేశారు.
గుజరాత్లోని వడోదర, అహ్మదాబాద్, మెహ్సనాలో వంద శాతం ఐసీయూ పడకలు ఉన్నాయని హర్షవర్ధన్ తెలిపారు. అహ్మదాబాద్లో 97 శాతం, వడోదరలో 96 శాతం ఆక్సిజన్ పడకలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: రెమ్డెసివిర్ కోసం కిక్కిరిసిన జనం