దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొత్తగా 53,256 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 88 రోజుల్లో ఇవే అత్యల్ప రోజువారీ కేసులు కావడం గమనార్హం.
కాగా, మహమ్మారి ధాటికి మరో 1,422 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 78,190 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 2,99,35,221
- మొత్తం మరణాలు: 3,88,135
- కోలుకున్నవారు: 2,88,44,199
- యాక్టివ్ కేసులు: 7,02,887
ఆదివారం ఒక్కరోజే 13,88,699నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 39,24,07,782కు చేరింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి : ' రెండో దశలో కరోనా మరణాలు 15లక్షల కంటే అధికం'
కరోనాపై పోరులో భాగంగా ఇప్పటివరకు 28 కోట్ల 36 వేలకు పైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం 30లక్షల 39వేల 996 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది.
ఇదీ చదవండి : మరో ఆరు వారాల్లో థర్డ్ వేవ్ అటాక్!