Corona Cases In India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. మరో 3,324 మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,876 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 79వేల పైకి చేరింది.
- యాక్టివ్ కేసులు: 19,092
- మొత్తం మరణాలు: 5,23,843
- మొత్తం కేసులు: 4,30,79,188
- రికవరీలు: 4,25,36,253
Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. శనివారం 25,95,267 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,89,17,69,346 కు చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 4,23,430 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 1,325 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- జర్మనీలో 57,003 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 106 మంది మృతిచెందారు.
- ఇటలీలో 53,602 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 130 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 49,482 మంది వైరస్ సోకింది. మరో 61 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 43,262 కరోనా కేసులు నమోదయ్యాయి. 70 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 24,751 కరోనా కేసులు బయటపడ్డాయి. 115 మంది వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చదవండి: ప్రికాషన్ డోసు కాల వ్యవధిపై కేంద్రం క్లారిటీ