భారత్లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 32,937 మంది వైరస్ బారినపడ్డారు. మరో 417 మంది మరణించారు. కొత్తగా 35,909 మంది కరోనాను జయించారు.
వ్యాక్సినేషన్..
దేశంలో ఆదివారం 11,81,212 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 49,48,05,652కు చేరింది. కొత్తగా 17,43,114 వ్యాక్సిన్లు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు మొత్తంగా 54,58,57,108 టీకా డోసులు పంపిణీ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- మొత్తం కేసులు :3,22,25,513
- యాక్టివ్ కేసులు :3,81,947
- కోలుకున్నవారు:3,14,11,924
- మరణాలు :4,31,642
ప్రపంచంలో కొవిడ్ కేసులు..
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,69,864 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 8,148 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 20,79,92,282కి చేరగా.. మరణాల సంఖ్య 43,74,912కు పెరిగింది.
కొత్త కేసులు..
- అమెరికా- 30,883
- బ్రెజిల్- 13,957
- ఫ్రాన్స్- 21,172
- బ్రిటన్- 26,750
- రష్యా- 21,624
ఇదీ చదవండి:'వ్యాక్సినేషన్లో సరిలేరు మనకెవ్వరు..!'