దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 18,833 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 203 మంది మరణించారు.
- మొత్తం కేసులు: 3,38,71,881
- మొత్తం మరణాలు: 4,49,409
- యాక్టివ్ కేసులు: 2,46,682
కొవిడ్ పరీక్షలు..
మంగళవారం ఒక్కరోజే దేశంలో 14,09,825 కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 57,68,03,867కు చేరింది.
వ్యాక్సినేషన్..
దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ నిర్విరమంగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 72,51,419 డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 91,54,65,826 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభణ (Global corona virus update) కొనసాగుతోంది. కొత్తగా 4,11,101 మందికి కరోనా (Corona update) సోకింది. మహమ్మారి ధాటికి మరో 7,487 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 236,571,503కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,830,671కి పెరిగింది.
ఆయా దేశాల్లో కొత్త కేసులు..
సింగపూర్‌లో కొత్తగా 3,486 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో తొమ్మిది మంది మరణించారు.
- అమెరికా - 94,811
- బ్రిటన్ - 33,869
- రష్యా - 25,110
- బ్రెజిల్ - 20,528
- ఇరాన్ - 13,226
ఇవీ చదవండి: