దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. ఒక్కరోజే 10,229 మందికి వైరస్ పాజిటివ్‌గా(Corona cases in India) తేలింది. కరోనా (Coronavirus India) ధాటికి మరో 125 మంది బలయ్యారు. దేశంలో కొత్తగా 11,926 మంది వైరస్‌ను జయించారు.
- మొత్తం కేసులు: 3,44,47,536
- మొత్తం మరణాలు: 4,63,655
- యాక్టివ్ కేసులు: 1,34,096
- కోలుకున్నవారు: 3,38,49,785
టీకాల పంపిణీ..
దేశంలో కొవిడ్ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 30,20,119 డోసులు అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,12,34,30,478కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 3,47,414 మందికి కొవిడ్ (Corona update) సోకింది. కరోనా ధాటికి 4,464 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,40,15,575కు చేరింది. మొత్తం మరణాలు 51,15,009 కి చేరాయి.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికాలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. 24,193 మందికి వైరస్ సోకింది. మరో 126 మంది చనిపోయారు.
- రష్యాలో మరో 39,256 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజే 1,241 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 36,517 మంది వైరస్ బారినపడ్డారు. మరో 63 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 21,624 కరోనా కేసులు నమోదవగా.. 189 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో మరో 29,048 మందికి కొవిడ్ సోకింది. 35 మంది మరణించారు.
ఇదీ చదవండి:Covaxin: 'కొవాగ్జిన్ టీకా వెనుక.. 20 కోతులు'