దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 81,466 కేసులు వెలుగుచూశాయి. మరో 469 మంది మహమ్మారికి బలయ్యారు.
- మొత్తం కేసులు: 1,23,03,131
- మొత్తం మరణాలు: 1,63,396
- కోలుకున్నవారు: 1,15,25,039
- యాక్టివ్ కేసులు: 6,14,696
వైరస్ సోకిన వారిలో 50,356 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 93.68 శాతంగా, మరణాల రేటు 1.33 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 11లక్షల 13వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 24కోట్ల 59లక్షలు దాటింది.
తాజాగా.. 36.71 లక్షల మందికి వ్యాక్సిన్ సరఫరా చేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 6.87 కోట్లకు చేరింది.
ఇదీ చదవండి: మహారాష్ట్రలో కరోనా పంజా- కొత్తగా 43 వేల కేసులు