దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. వరుసగా రెండో రోజూ కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 45,892 మందికి కొవిడ్(Covid-19) సోకింది. 44,291 మంది కోలుకోగా.. 817 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు : 3,07,09,557
- మొత్తం మరణాలు : 4,05,028
- కోలుకున్నవారు : 2,98,43,825
- యాక్టివ్ కేసులు : 4,60,704
మొత్తం టెస్టులు..
దేశంలో ఇప్పటివరకు 42,52,25,897 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తెలిపింది. బుధవారం ఒక్కరోజే 18,93,800 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.
వ్యాక్సినేషన్..
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 36,48,47,549 డోసుల పంపిణీ జరిగింది. బుధవారం.. 33,81,671 డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రపంచంలో కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,56,830 కరోనా కేసులు నమోదయ్యాయి. 8,424 మంది మృతి చెందగా.. 3,67,408 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 18,58,25,502గా ఉంది.
- అమెరికా - 3,46,43,902
- భారత్ - 3,07,08,570
- బ్రెజిల్ - 1,89,09,037
- ఫ్రాన్స్ - 57,94,665
- రష్యా - 56,82,634
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి : Third wave: భారత్లో మూడోదశ ముప్పు తక్కువే!