దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే కాస్త పెరిగాయి. కొత్తగా 39,097 మందికి వైరస్(Covid 19 India) సోకగా 35,087 మంది కోలుకున్నారు. 546 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 3,13,32,159
- మొత్తం మరణాలు: 4,20,016
- కోలుకున్నవారు: 3,05,03,166
- యాక్టివ్ కేసులు: 4,08,977
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 97.35శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా.. 1.31శాతంగా ఉన్నట్లు చెప్పింది.
పరీక్షలు
దేశవ్యాప్తంగా శుక్రవారం 16,68,561 మందికి పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది.
వ్యాక్సినేషన్
దేశంలో ఇప్పటివరకు 42,78,82,261 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 54,76,423 డోసులు అందించినట్లు తెలిపింది.
ప్రపంచంలో కొవిడ్ కేసులు..
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,73,762 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 8,646 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19,40,14,060కి చేరగా.. మరణాల సంఖ్య 41,59,695కు పెరిగింది.
కొత్త కేసులు..
- అమెరికా- 67,485
- బ్రెజిల్- 45,460
- ఫ్రాన్స్- 19,561
- బ్రిటన్- 36,389
- రష్యా- 23,811
ఇవీ చూడండి: