దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కొత్తగా 3,57,229 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల మార్క్‌ను చేరింది. ఈ జాబితాలో 3.33 కోట్ల కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. కొవిడ్ సోకిన వారిలో మరో 3,449 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 2,02,82,833
- మొత్తం మరణాలు: 2,22,408
- మొత్తం కోలుకున్నవారు: 1,66,13,292
- యాక్టివ్ కేసులు: 34,47,133
ఇదీ చదవండి:ఆ రాష్ట్రంలో.. కుంభమేళాకు వెళ్లిన వారందరికీ కరోనా!
కొవిడ్ సోకిన వారిలో 3,20,289 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 81.91 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు 1.10 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కరోనా కట్టడిలో భాగంగా.. ఇప్పటివరకు మొత్తం 15.89 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఇదీ చదవండి: కొవిడ్-19 చికిత్సకు నాట్కో ఔషధం