దేశంలో బుధవారంతో పోల్చితే.. గురువారం కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 16,577 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 120 మంది కరోనాతో మృతిచెందారు.
- మొత్తం కేసులు: 1,10,63,491
- మరణాలు: 1,56,825
- రికవరీల సంఖ్య: 1,07,50,680
- యాక్టివ్ కేసులు: 1,55,986
వైరస్ సోకిన వారిలో 12,179 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.17 శాతానికి తగ్గగా.. మరణాల రేటు స్థిరంగా 1.42 శాతంగా నమోదైంది.
అటు.. గురువారం ఒక్కరోజే 8లక్షల 31వేల 807 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 21.46 కోట్లు దాటింది.
దేశవ్యాప్తంగా మరో 8,01,480 మందికి కొవిడ్ టీకా అందించినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1కోటీ 34లక్షల 72వేలు దాటినట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: కొవిడ్ 2.0: మళ్లీ లాక్డౌన్ విధిస్తారా?