దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 12,408 మందికి వైరస్ సోకినట్టు తేలింది. కొవిడ్ బారినపడిన వారిలో మరో 120 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 10,802,591
- యాక్టివ్ కేసులు: 1,51,460
- కోలుకున్నవారు: 1,04,96,308
- మొత్తం మరణాలు: 1,54,823
కరోనా సోకినవారిలో మరో 15,853 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా దేశవ్యాప్త రికవరీ రేటు 97.16 శాతానికి పెరిగింది. మరణాల రేటు స్థిరంగా 1.43 శాతంగా కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా.. తాజాగా 7లక్షల 15వేల 776 నమూనాలను పరీక్షించినట్టు తెలిపింది భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్). దీంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 20 కోట్లకు సమీపించింది.
మరోవైపు.. దేశంలో గురువారం ఒక్కరోజే సుమారు 5లక్షల 9వేల మందికిపైగా టీకా అందించినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు సుమారు 49.59 లక్షల మంది లబ్ధిదారులు టీకా పొందినట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: కొవిడ్ టీకా: పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చా..?