ETV Bharat / bharat

'దేశంలో కరోనా గ్రాఫ్​ తగ్గుముఖానికి ఇదే నిదర్శనం' - భారత్​ శిక్షణ

భారత్​లో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ తగ్గుతోందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్​. 146 జిల్లాల్లో గత ఏడు రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదని.. దేశంలో కరోనా గ్రాఫ్​ తగ్గుముఖాన్ని ఇది సూచిస్తుందన్నారు.

India has flattened its COVID-19 graph; 146 districts have no new cases for 7 days: Vardhan
'దేశంలో కరోనా గ్రాఫ్​ తగ్గుతోంది'
author img

By

Published : Jan 28, 2021, 4:46 PM IST

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనా మహమ్మారిపై నిర్వహించిన ఉన్నత స్థాయి మంత్రుల 23వ సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 146 జిల్లాల పరిధిలో గత ఏడు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. కరోనా గ్రాఫ్ తగ్గుముఖానికి ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు.. 'సమాజ హితం కోసమే ప్రభుత్వం' అనే నినాదాన్ని అనుసరించి దేశంలో కరోనాను విజయవంతంగా అరికట్టగలిగామని తెలిపారు.

19.5కోట్ల పరీక్షలు..

దేశంలో ప్రస్తుతం రోజుకు 12లక్షల కరోనా టెస్టులు చేయగలుగుతున్నామని.. ఇప్పటివరకూ 19.5 కోట్ల పరీక్షలు నిర్వహించామని మంత్రి వెల్లడించారు. గత 24 గంటల్లో 12,000 కన్నా తక్కువ కేసులు నమోదు కాగా.. క్రియాశీల కేసుల సంఖ్య 1.73 లక్షలుగా ఉంది. అందులో 0.46శాతం మాత్రమే వెంటిలేటర్​పై ఉన్నారని తెలిపారు మంత్రి. మరో 2.20 శాతం ఐసీయూలో, 3.02 శాతం ఆక్సిజన్ సాయంతో చికిత్స తీసుకుంటున్నారని వివరించారు.

పొరుగు దేశాలకు టీకా గర్వకారణం..

కరోనాపై పోరులో భారత్​.. పొరుగు దేశాలకు మద్దతుగా నిలవడం గర్వంగా ఉందన్నారు హర్షవర్ధన్​. సంక్షోభంలో కరోనా టీకా అందించడమే కాక.. ఇతర దేశాల సిబ్బందికి భారత్​ శిక్షణ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ సంక్షోభ సమయంలో దేశీయంగా తయారైన వ్యాక్సిన్లను ఇతర దేశాలకు సరఫరా చేసి.. ప్రపంచ దేశాల విశ్వాసాన్ని భారత్​ చూరగొందని తెలిపారు.

దేశంలో ఇప్పటివరకు బ్రిటన్​ రకం కొత్త వైరస్​ కేసులు 165 నమోదయ్యాయని, వీరిని క్వారంటైన్​లో ఉంచామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: 'పరస్పర సహకారంతోనే కరోనా పోరులో ముందడుగు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.