India covid cases: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 16,764 కేసులు వెలుగుచూశాయి. మరో 220 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,585 మంది కోలుకున్నారు. మరోవైపు, ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,270కి చేరింది.
- మొత్తం కేసులు: 3,48,38,804
- మొత్తం మరణాలు: 4,81,080
- యాక్టివ్ కేసులు: 91,361
- కోలుకున్నవారు: 3,42,66,363
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం మరో 66,65,290 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,44,54,16,714 కు చేరింది.
Worldwide covid cases today
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 18 లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 6,827 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 5.6లక్షల కేసులు నమోదయ్యాయి. 1,354 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8.46లక్షలకు చేరింది.
- ఫ్రాన్స్‌లో 2.06లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 180 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,23,552కు చేరింది.
- బ్రిటన్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా లక్షా 89 వేల కేసులు నమోదయ్యాయి. 332 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.
- స్పెయిన్‌లో ఒక్కరోజే 1.61 లక్షల కరోనా కేసులు బయటపడ్డాయి. 76 మంది కరోనాతో మరణించారు. 11 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- ఇటలీలో 1.26 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 156 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 59,81,428కు పెరిగింది. మరణాల సంఖ్య 137,247కు చేరుకుంది.
ఇదీ చూడండి: మహారాష్ట్రలో 5వేల కరోనా కేసులు.. దిల్లీలో రికార్డు స్థాయిలో..