ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 25,920 కేసులు.. 492 మరణాలు

India covid cases: దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. 25,920 మందికి కొత్తగా వైరస్​ సోకింది. 492 మంది కొవిడ్​ కారణంగా చనిపోయారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

COVID
కొవిడ్​
author img

By

Published : Feb 18, 2022, 9:26 AM IST

India covid cases: దేశంలో కరోనా కేసులు మరోసారి తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 25,920 మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 492 మంది మరణించారు. 66,254 మంది బాధితులు కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 2.07 శాతానికి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

  • మొత్తం మరణాలు: 5,10,905
  • యాక్టివ్ కేసులు: 2,92,092
  • మొత్తం కోలుకున్నవారు: 4,19,77,238

Covid Tests in India: దేశవ్యాప్తంగా గురువారం 12,54,893 కరోనా పరీక్షలు చేశారు.

Vaccination in India:

దేశంలో వ్యాక్సినేషన్ వేగంగానే కొనసాగుతోంది. గురువారం మరో 37,86,806 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,74,64,99,461 కు చేరింది.

World Covid cases:
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 20 లక్షలకు పైగా కేసులు బయటపడ్డాయి. జర్మనీ, రష్యా, బ్రెజిల్, అమెరికా దేశాల్లో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 11 వేలకు పైగా మంది కొవిడ్​తో కన్నుమూశారు.

  • జర్మనీలో కొత్తగా 2.27 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 244 మంది మృతి చెందారు.
  • రష్యాలో లక్షా 80 వేల మందికి కరోనా సోకినట్లు తేలింది. 790 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో 24 గంటల్లో వెయ్యి మందికి పైగా కరోనా మరణాలు సంభవించాయి. కొత్తగా 1.29 లక్షల కేసులు బయటపడ్డాయి.
  • అమెరికాలో కరోనా... మరణ మృదంగం మోగిస్తోంది. 24 గంటల్లో 2184 మంది ప్రాణాలను వైరస్ తోడేసింది. లక్షా 3 వేల కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: కొవిడ్​ మరణాలపై దుష్ప్రచారం.. కేంద్రం ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.