India Covid Cases: దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 12,213 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 7,624 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.66 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.12 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.35 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.38 శాతంగా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 43,257,730
- మొత్తం మరణాలు: 5,24,803
- యాక్టివ్ కేసులు: 58,215
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,74,712
Vaccination India: భారత్‌లో బుధవారం 15,21,942 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,95,67,37,014 కోట్లకు చేరింది. మరో 5,19,419మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 601,129 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,368 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 542,428,261కు చేరింది. మరణాల సంఖ్య 6,336,471కు చేరింది. ఒక్కరోజే 532,972 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 517,498,965గా ఉంది.
- అమెరికాలో 99,100 కేసులు వెలుగుచూశాయి. మరో 305 మందికిపైగా చనిపోయారు.
- తైవాన్‌లో మరో 68,965 కేసులు, 143కుపైగా మరణాలు నమోదయ్యాయి
- బ్రెజిల్లో 68,769 కరోనా కేసులు, 289 మరణాలు నమోదయ్యాయి.
- ఫ్రాన్స్‌లో 51,954 కేసుల నమోదయ్యాయి. 49 మంది మరణించారు.
- జర్మనీలో ఒక్కరోజే 37,291 మంది కొవిడ్ బారినపడ్డారు.
ఇవీ చదవండి: నీటి గుంతలో పడిన స్కార్పియో.. 8 మంది దుర్మరణం