Covid Cases India: దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 1,259 మందికి వైరస్ సోకింది. మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,705 మంది వైరస్ను జయించారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. సోమవారం మరో 25,92,407 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,83,53,90,499కు పెరిగింది.
- మొత్తం కేసులు: 4,30,21,982
- మొత్తం మరణాలు: 5,21,070
- యాక్టివ్ కేసులు: 15,378
- కోలుకున్నవారు: 4,24,85,534
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అన్ని దేశాల్లో కలిపి మరో 9,39,991 కొత్త కేసులు వెలుగు చూశాయి. 2,780 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 48,30,35,119కు చేరగా.. మృతుల సంఖ్య 61,51,470కు పెరిగింది. కరోనా ప్రభావం జర్మనీలో అత్యధికంగా ఉంది. అక్కడ కొత్తగా 2,14,035 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య రెండు కోట్లు దాటింది.
దేశం | కొత్త కేసులు | కొత్త మరణాలు | మొత్తం కేసులు | మొత్తం మరణాలు | |
1 | దక్షిణ కొరియా | 1,87,213 | 287 | 1,20,03,054 | 15,186 |
2 | వియత్నాం | 1,20,000 | 70 | 90,11,473 | 42,306 |
3 | జర్మనీ | 2,14,035 | 159 | 2,04,65,072 | 1,29,106 |
4 | ఫ్రాన్స్ | 29,455 | 124 | 2,50,59,028 | 1,41,821 |
5 | ఇటలీ | 30,710 | 95 | 1,43,96,283 | 1,58,877 |