ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 29 మంది మృతి - భారత్​లో రోజువారీ కేసులు

India Corona Cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే కాస్త తగ్గాయి. ఒక్కరోజులో 3,207‬ కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 29 మంది చనిపోయారు.

India corona cases today
భారత్​లో కరోనా కేసులు
author img

By

Published : May 9, 2022, 9:09 AM IST

India Corona Cases: దేశంలో కొవిడ్​ కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 3,207‬ కేసులు నమోదయ్యాయి. 29 మంది చనిపోయారు. మరో 3410 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరింది. యాక్టివ్​ కేసుల సంఖ్య 0.05 శాతంగా ఉంది.

మొత్తం కరోనా కేసులు: 4,31,05,401

మొత్తం మరణాలు: 5,24,093

యాక్టివ్​ కేసులు: 20,403

కోలుకున్నవారి సంఖ్య: 4,25,60,905

Vaccination India: దేశవ్యాప్తంగా ఆదివారం 13,50,622 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,90,34,90,396కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల 36 వేలకుపైగా కరోనా టెస్టులు నిర్వహించింది కేంద్రం.

World Covidcases: ప్రపంచదేశాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్తగా మొత్తం 3 లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 600 మందికిపైగా మరణించారు.

  • దక్షిణ కొరియాలో అత్యధికంగా 40వేలకుపైగా కొత్త కేసులు వచ్చాయి. 71 మరణాలు నమోదయ్యాయి.
  • ఆస్ట్రేలియాలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మరో 35వేల మందికి వైరస్​ సోకగా.. 18 మంది మరణించారు.
  • జపాన్​లో కొత్తగా 34వేల మందికి వైరస్​ సోకింది. మరో 24 మంది మరణించారు.
  • ఇటలీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే 30 వేలమందికిపైగా వైరస్​ బారినపడ్డారు. 72 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో 29 వేల మందికి వైరస్​ సోకగా.. మరో 54 మంది చనిపోయారు.
  • అమెరికాలో వైరస్​ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తగా 14వేల మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 21 మరణాలు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: శవాలను కూర్చోబెట్టి స్టూడెంట్స్​కు క్లాస్​- డాక్టర్​ ప్రయోగం సక్సెస్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.