India Covid Cases: దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 7,584 మంది వైరస్ బారిన పడ్డారు. 24 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు విడిచారు. గురువారం 3,791 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.08 శాతం వద్ద ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,31,97,866
- మొత్తం మరణాలు: 5,24,747
- యాక్టివ్ కేసులు: 36,267
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,44,092
Vaccination India: భారత్‌లో గురువారం 15,31,510 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,76,42,992 చేరింది. మరో 3,35,050 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 5,62,194 కేసులు వెలుగుచూశాయి. మరో 1,417 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 53,86,24,780కు చేరింది. మరణాల సంఖ్య 63,28,024కు చేరింది. ఒక్కరోజే 4,36,982 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 51,17,41,076గా ఉంది.
- అమెరికాలో 80,993 కొత్త కేసులు, 195 మరణాలు వెలుగుచూశాయి.
- జర్మనీలో 75,494 మంది కరోనా బారిన పడ్డారు. మహమ్మారితో 61 మంది ప్రాణాలు కోల్పయారు.
- తైవాన్‌లో 72,967 కొవిడ్ కేసులు, 211 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఉత్తర కొరియాలో 50,870 కేసులు నమోదయ్యాయి.
- బ్రెజిల్లో 45,073 మంది వైరస్ బారిన పడ్డారు. 148 మంది చనిపోయారు.
ఇవీ చదవండి: మహారాష్ట్ర, దిల్లీలో కరోనా పంజా.. ఆ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక!