ETV Bharat / bharat

భారత్​లో కాస్త తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు - కొవిడ్​ కలకలం

India Corona Cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే కాస్త తగ్గాయి. ఒక్కరోజులో 3,451 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 40 మంది చనిపోయారు.

India corona cases
India corona cases
author img

By

Published : May 8, 2022, 9:28 AM IST

India Corona Cases: దేశంలో కొవిడ్​ కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 3,451 కేసులు నమోదయ్యాయి. 40 మంది చనిపోయారు. మరో 3079 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరింది. యాక్టివ్​ కేసుల సంఖ్య 0.05 శాతంగా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,31,02,194‬
  • మొత్తం మరణాలు: 5,24,064
  • యాక్టివ్​ కేసులు: 20,635
  • కోలుకున్నవారి సంఖ్య: 4,25,57,495

Vaccination India: దేశవ్యాప్తంగా శనివారం 17,39,403 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,90,20,07,487కు చేరింది. నిన్న ఒక్కరోజే 3 లక్షల 60 వేలకుపైగా కరోనా టెస్టులు నిర్వహించింది కేంద్రం.
World Covidcases: ప్రపంచదేశాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్తగా మొత్తం 4 లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 1000 మందికిపైగా మరణించారు.

  • జర్మనీలో శనివారం 48 వేల కేసులు.. 102 మరణాలు సంభవించాయి.
  • ఇటలీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే 40 వేలమందికిపైగా వైరస్​ బారినపడ్డారు. 113 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియాలోనూ దాదాపు 40 వేల కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి.
  • ఫ్రాన్స్​లో 37 వేల మందికి వైరస్​ సోకగా.. మరో 62 మంది చనిపోయారు.
  • అమెరికాలో 31 వేల కేసుులు, 87 మరణాలు నమోదయ్యాయి.

ఇవీ చూడండి: మొక్కలతో వ్యాక్సిన్ తయారీ.. ఐదు కొవిడ్​ వేరియంట్లకు చెక్​!

ప్రేమకు నిరాకరించిందని మూడంతస్తుల భవనానికి నిప్పు.. 9 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.